Visa, Mastercard Suspend Russia: రష్యాకు మరో షాక్, వీసా, అక్కడ మాస్టర్ కార్డులపై ఆంక్షలు విధించిన సంస్థలు, ఏటీఎంల ముందు క్యూ కట్టిన రష్యన్లు, ఆర్ధికంగా రష్యాకు భారీ ఎదురుదెబ్బ
ATM/ Debit Cards (Photo Credits: Pixabay)

Moscow, March 06:  ఉక్రెయిన్‌పై (Ukraine) భీకర దాడి చేస్తోన్న రష్యా (Russia)కు అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే రష్యాను పలు దేశాలు దూరం పెట్టాయి. పలు సంస్థలు కూడా రష్యాను బహిష్కరిస్తున్నాయి. ముఖ్యంగా రష్యాను ఆర్ధికంగా దెబ్బతీస్తున్నాయి. అమెరికా పేమెంట్ దిగ్గజాలైన వీసా, మాస్టర్ కార్డులు (Visa, Master Cards) ఉక్రెయిన్‌పై జరుపుతోన్న దాడిని నిరసిస్తూ రష్యాలో ఆపరేషన్స్‌ను (Operations) నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దెబ్బ కొట్టనుంది. రష్యన్ ఆర్థిక వ్యవస్థను మరింత ఐసోలేట్ చేయాలని, ఆంక్షలు తీవ్రతరం కావాలని, కార్పొరేట్ బాయ్‌కాట్ చేపట్టాలని ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీ కోరడంతో.. కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రష్యాలో తమతో కలిసి పనిచేస్తోన్న క్లయింట్లు, పార్టనర్లను తమ లావాదేవీలన్ని ఆపివేయమని ఆదేశించినట్టు శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన వీసా (Visa)తెలిపింది. ఒకసారి ఈ ప్రాసెస్ పూర్తయ్యాక, రష్యాలో జారీ చేసిన వీసా కార్డులు బయట దేశాలలో పనిచేయవు. అదేవిధంగా వేరే దేశాలలో జారీ చేసిన వీసా కార్డులు రష్యాలు వర్క్ చేయవు. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో గత వారమే తమ నెట్‌వర్క్ వాడుతూ రష్యాలో జరుపుతోన్న కొన్ని ఆర్థిక సంస్థల లావాదేవీలను ఈ కంపెనీలు బ్లాక్ చేశాయి.

Topless Protesters Against Putin:పుతిన్ కు వ్యతిరేకంగా దుస్తులు విప్పేసిన మహిళలు, రష్యా ఎంబసీ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన స్పెయిన్ మహిళా సంఘాలు

తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఐసోలేషన్‌లోకి నెట్టేస్తూ.. లావాదేవీలన్నింటిన్ని బ్లాక్ చేశాయి కంపెనీలు. రష్యాపై విధిస్తోన్న ఈ ఆంక్షల ప్రభావం ఇప్పటికే ఆ దేశంలో కనిపిస్తోంది. మాస్టర్ కార్డు, వీసాలు అందించే పేమెంట్ కార్డు సర్వీసులు నిలిపివేస్తారనే ముందస్తు అంచనాలతో అక్కడి ప్రజలు క్యాష్‌ను విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు పరిగెత్తారు. ఏటీఎంల (ATM) వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపించాయి. రష్యన్ బ్యాంకింగ్ సిస్టమ్ లిక్విడిటీపై పలువురు పశ్చిమ దేశాల నిపుణులు పలు హెచ్చరికలు జారీ చేశారు. వీసా, మాస్టర్ కార్డుతో పాటు అన్ని రకాల వాణిజ్యపరమైన లావాదేవీలపై నిషేధం విధించాలని జెలెన్‌స్కీ శనివారం వీడియోకాల్‌లో అమెరికన్ చట్టసభ్యులను కోరారు.

Zaporizhzhia Nuclear Power Plant: యుక్రెయిన్‌ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం

ర‌ష్యా చ‌ర్య శాంతి, సుస్థిర‌త‌కు ముప్పుగా ప‌రిణ‌మించింద‌న్నారు. ఉద్యోగులు, వినియోగ‌దారులు, ఇండ‌స్ట్రీలోని వివిధ వ‌ర్గాల అభిప్రాయాల‌ను తీసుకున్న త‌ర్వాత ర‌ష్యాలో కార్య‌క‌లాపాలు నిలిపేయాల‌ని నిర్ణ‌యించామ‌ని మాస్ట‌ర్ కార్డ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. త‌మ సేవ‌ల‌ను కొన‌సాగించాల‌నే తాము భావించామ‌ని, కానీ ప్ర‌స్తుత సంక్షోభంతో నెల‌కొన్న అసాధార‌ణ ప‌రిస్థితులు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఒడిదొడుకుల నేప‌థ్యంలో ర‌ష్యాలో నెట్‌వ‌ర్క్ సేవ‌లు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు పేర్కొంది.