Kerala: కేరళలో ఘోర అగ్ని ప్రమాదం, నిద్రలోనే 5 గురు అగ్నికి ఆహుతి, మరొకరి పరిస్థితి విషమం, కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Fire (Photo Credits: ANI)

Varkala, Mar 8: కేరళలోని వర్కలాలో ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన 5 గురు వ్యక్తులు (Family of five killed in house fire) మరణించారు. మంగళవారం తెల్లవారుజామున 1.45 గంటల ప్రాంతంలో దలవపురంలోని కుటుంబం యొక్క ఇల్లు అగ్నికి (Fire at Kerala Home ) ఆహుతైంది.ఆ కుటుంబ స‌భ్యులంతా గాఢ నిద్ర‌లో ఉండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

దలవపురంలో ప్ర‌తాప‌న్(62) అనే త‌న భార్య శేర్లి(53), అభిరామి(25), అఖిల్‌(29), నిహుల్, అభిరామి కుమారుడు(8 నెల‌లు)తో క‌లిసి ఉంటున్నాడు. కుటుంబాన్ని పోషించేందుకు ప్ర‌తాప‌న్ కూర‌గాయ‌ల వ్యాపారం చేస్తున్నాడు. అయితే మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ప్ర‌తాప‌న్ ఇంట్లో మంట‌లు చెల‌రేగాయి. ఇంట్లో నుంచి ద‌ట్ట‌మైన పొగ‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో స్థానికులు అప్ర‌మ‌త్త‌మై పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, నిహుల్ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఇంట్లో ఉన్న ఏసీతో పాటు, ఐదు బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి.

శాడిస్టు భర్త.. పార్టీలో స్నేహితులకు భార్యను అప్పగించాడు, భర్తతో సహా అందరూ దారుణంగా ఆమెపై అత్యాచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ధారణకు రాలేమని అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు స్థలాన్ని పరిశీలించిన తర్వాత అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దివ్య గోపీనాథ్ తెలిపారు.