Kollam, July 18: కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ నీట్ ఎగ్జామ్ సెంటర్‌లో (National Eligibility cum Entrance Test (NEET) విద్యార్థినుల పట్ల అక్కడున్న సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. మహిళల లోదుస్తులు విప్పేసిన తర్వాతే (remove innerwear) నీట్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థినులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.దేశ వ్యాప్తంగా నిన్న మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్-2022 నిర్వహించిన సంగతి తెలిసిందే.
దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కేరళ కొల్లాంలోని మార్తోమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీలో నీట్ ఎగ్జామ్ 2022 (NEET 2022) నిర్వహించారు. ఈ కేంద్రంలో పరీక్షకు హాజరైన సుమారు 100 మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. అమ్మాయిలందరూ (female medical aspirants) లో దుస్తులు విప్పాలని సిబ్బంది ఆదేశించారు. ఎగ్జామ్‌కు సమయం అవుతుండటంతో.. తప్పని పరిస్థితుల్లో విద్యార్థినులందరూ లో దుస్తులు విప్పి వారి తల్లికి అవి ఇచ్చి పరీక్షకు హాజరయ్యారు.
కొందరు అక్కడ ఓ డబ్బాలో లో దుస్తులు ఉంచిన దృశ్యాలు కనిపించాయని పరీక్ష అనంతరం విద్యార్థినులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై పరీక్షా కేంద్రం సిబ్బందిని వివరణ కోరగా.. లో దుస్తులకు బెల్ట్స్ వంటి పరికరాలు ఉండటం వల్లే అలా చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. అలాగే పరీక్షా కేంద్రంలోని సాధారణ చెప్పులను మాత్రమే అనుమతించారు. ఆభరణాలు, మెటల్ వస్తువులు, ఎలాంటి వాచీలు, కెమెరాలు, టోపీ, బెల్ట్, పర్సు, హ్యాండ్ బ్యాగ్‌లకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు.
ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక మూలాల ప్రకారం, దాదాపు 100 మంది స్త్రీలు ఈ దృష్టాంతంలో విద్యార్థినులు ఇలా బాధించబడ్డారు. కొత్తరక్క వద్ద డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కి విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఇదేమి కొత్త ఘటన కాదు.. 2017లో తమిళనాడులోని కన్నూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.