Virus (Representative Image; Photo Credit: Pixabay)

అలప్పుజ, జూలై 7: కలుషితమైన నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా కారణంగా అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేసు కేరళలోని అలప్పుజా తీర ప్రాంతంలో నమోదైందని ప్రభుత్వ ప్రకటన శుక్రవారం తెలిపింది. సమీపంలోని పనవల్లికి చెందిన 15 ఏళ్ల వ్యక్తికి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి సోకినట్లు తెలిపింది.

రోగికి సంబంధించిన అదనపు సమాచారాన్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదు. ఇంతకుముందు 2017లో అలప్పుజ మున్సిపాలిటీ ప్రాంతంలో ఈ వ్యాధి నమోదైందని ఆరోగ్య అధికారులు తెలిపారు. స్వేచ్ఛగా జీవించే, పరాన్నజీవి కాని అమీబా బ్యాక్టీరియా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనిషి మెదడుకు ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు తెలిపారు. వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు కలుషిత నీటిలో స్నానాలు చేయవద్దని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సూచించారు.

పురుషాంగం పెరగడం పూర్తిగా ఆగిపోయే వయసు ఇదే, ఈ వయసు దాటితే దాని ఎదుగుదల ఆగిపోతుంది..

స్థానికంగా పనవల్లీ ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. తలనొప్పి, వాంతులు, మూర్చ వంటి ఇతర లక్షణాలు రోగిలో గమనించిన వైద్యులు.. షాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. దీంతో అమీబా కారణంగా సోకే అరుదైన వ్యాధి కారకం అతనిలో ఉన్నట్లు గుర్తించారు. చికిత్సను ప్రారంభించామని తెలిపారు.

ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్ఛలు. కలుషిత నీటిలో స్వేచ్చగా జీవించే అమీబా కారణంగా ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన అనంతరం మానవ శరీరంలోని మెదడుపై దాడి చేస్తుందని వెల్లడించారు. తీవ్ర జ‍్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చకు సంబంధించిన లక్షణాలు ఉంటాయని తెలిపారు.