Kasaragod, May 2: కేరళలోని ఓ షాప్‌లో షవర్మా తిన్న 16ఏళ్ల బాలిక ఫుడ్ పాయిజన్ అయి మృతి (Student Dies of Food Poisoning) చెందింది. దాంతోపాటు 18మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స (18 Fall Sick After Consuming Shawarma) తీసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఆదివారం జరిగింది. ఓ ట్యూషన్ కేంద్రానికి దగ్గర్లో ఉన్న జ్యూస్ షాప్ లో షవర్మా కూడా అమ్ముతారు. అక్కడ ట్యూషన్ కి వచ్చే పిల్లలు ఇక్కడే షవర్మా తింటారు, జ్యూస్ తాగుతారు.
నిన్న(మే 2న) కూడా అలాగే కొంతమంది విద్యార్థులు ఇక్కడ షవర్మా తిన్నారు. ఆహారం కలుషితం కావడంతో షవర్మా తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గుయారయ్యారు. ఇందులో ఓ 16 ఏళ్ళ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఆ జ్యూస్ షాప్‌లో షవర్మా తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. దీంతో జ్యూస్ షాప్‌పై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ఇక ఆసుపత్రిలో చేరిన మిగిలిన విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.
దేశంలో గత 24 గంటల్లో 3157 కరోనా కేసులు, 19,500 కేసులు యాక్టివ్, గత 24 గంటల్లో 26 మంది మృతి
అధికారులు షాప్ మీద కేస్ బుక్ చేసి, సీల్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. హాస్పిటల్ లో అడ్మిట్ అయిన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా లేనట్లు వైద్యులు తెలిపారు. మరిన్ని కేసులు నమోదు కావొచ్చని భావిస్తున్నాం. దగ్గర్లోని పీహెచ్ సీ, చెరువతూరు పీహెచ్ సీ, నీలేశ్వరమ్ తాలూక్ హాస్పిటల్స్ ఘటనాస్థలానికి వచ్చి తగు చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో ఉండి లక్షణాలు కనిపించిన వ్యక్తులకు వెంటనే చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా ఆరోగ్య అధికారి ఏవీ రామ్దాస్ తెలిపారు. ఆరోగ్యం మరింత విషమంగా ఉంటే జిల్లా హాస్పిటల్ కు తరలిస్తున్నారు.
పరిస్థితిని సమీక్షించేందుకు గానూ మంత్రి ఎమ్వీ గోవర్దన్ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ లో క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయాలని చెప్తూనే ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి రెస్టారెంట్లలో ఫుడ్ క్వాలిటీపై పరీక్షలు జరపనున్నామని మంత్రి తెలిపారు.