Himachal Pradesh Landslide. (Photo Credits: Twitter)

Kinnaur, August 11: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిన్నౌర్‌ జిల్లాలోని రెకాంగ్‌ పియో - సిమ్లా హైవేపై కొండచరియలు (Kinnaur Landslide) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. కొండచరియల కింద పలు వాహనాల్లో సుమారు 40 మంది చిక్కుకున్నట్లు (1 Dead, Over 40 Feared Buried) తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కిన్నౌర్‌ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ రవాణాకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు ఐటీబీపీ పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులతో వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు సహా, పలు వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయినట్టు డిప్యూటీ కమిషనర్ అబిత్ హుస్సేన్ షేఖ్ బుధవారంనాడు తెలిపారు.

సమాచారమందుకున్న ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు (All Possible Support In Recue Operation) చేపట్టారు. తొమ్మిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఐటీబీపీకి చెందిన మూడు బెటాలియ‌న్లు స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం రంగంలోకి దిగాయి. సుమారు 200 మంది జ‌వాన్లు ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆ ప్ర‌దేశంలో ఇంకా కొన్ని కొండ‌రాళ్లు ప‌డుతున్న‌ట్లు గుర్తించారు.

నాసా సంచలన రిపోర్ట్, సముద్రంలోకి జారుకోనున్న ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్టణంతో సహా 12 సముద్ర తీర ప్రాంత నగరాలు, ఈ శతాబ్దం చివరి నాటికి మూడు అడుగుల నీటి అడుగుకు ఈ నగరాలు చేరుతాయని అంచనా

సుమారు 40 మంది కొండ‌చ‌రియ‌ల కింద చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ ప్రాంతం ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ట్లు ఐటీబీపీ ప్ర‌తినిధి వివేక్ పాండే తె లిపారు. ఐటీబీపీలోని 17వ‌, 19వ‌, 43వ బెటాలియ‌న్ జ‌వాన్లు రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నారు. రెక్‌కాంగ్ పీయో- షిమ్లా హైవేపై ప‌డ్డ కొండ‌చ‌రియ‌ల‌ను తొల‌గించేందుకు ఐటీబీపీ ద‌ళాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ర‌క్షిస్తున్నారు.

ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌తో ఫోన్లో మాట్లాడి కేంద్రం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అటు అమిత్ షా కూడా ఠాకూర్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కిన్నౌర్‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘నిగుల్సారి ప్రాంతం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ ఆర్టీసి బస్సు అక్కడ చిక్కుకుపోయింది. ఇప్పటికే బస్సు డ్రైవర్‌ని, కొందరిని రక్షించాం. సహాయక చర్యలు కొనసాగతున్నాయి’’ అని తెలిపారు.