Image used for representational purpose

Kolkata, December 13: దేశంలో మహిళలపై హింస, దాడులు ఆగడం లేదు. ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం దక్షిణ కోల్‌కతాలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 60 ఏళ్ల మహిళ దారుణ హత్య(Kolkata Horror:) ఉదంతం. వృద్ధురాలు అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన కలకత్తాలో కలకలం రేపింది. ఆమెను కత్తితో పొడిచిచంపడంతోపాటు తలను(65-Year-Old Woman Murdered) నరికిశారు. పొట్టను చీల్చి వేశారు. ఇంత దారుణానికి ఎవరు, ఎందుకు పాల్పడ్డారో అంచనా వేయలేక పోలీసులు సైతం తలలు పట్టుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనలో చనిపోయిన మహిళను పంజాబ్‌కు ఊర్మిళ కుమారిగా గుర్తించారు.

తన ఇద్దరు కొడుకులతో గత కొన్నాళ్లుగా ఓ వృద్ధురాలు(elderly woman) కోలకతాలో నివసిస్తోంది. కుమారులు ఇద్దరు వివాహానికి హాజరయ్యేందుకు వేరే నగరానికి వెళ్లారు. దీంతో ఆమె రెండు రోజులుగా ఒంటరిగానే వుంటోంది. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. తలను వేరు చేయడంతోపాటు, పొత్తి కడుపును చీల్చివేశారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఆమె శరీరంపై బంగారం ఆభరణాలు, ఇంట్లోని నగదు అలానే ఉన్నాయనీ, దీంతో పగతో చేసిన (Revenge as Motive)హత్యగానే ప్రాథమికంగా భావిస్తున్నామని జాయింట్‌ పోలీసు కమిషనర్ (క్రైమ్) మురళీధర శర్మ అన్నారు.

అయితే విలువైన వస్తువులు ఏమైనా మాయమయ్యాలేదా అనేది ఇపుడే నిర్ధారించలేమని శర్మ తెలిపారు. బాధితురాలి కుమారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని వెల్లడించారు.అయితే ఊర్మిళ నివాసానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉండేదనీ, దీంతో అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పలుసార్లు ఆమె గారియాహాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని స్థానికులు చెప్పారు. ఆ కక్షతోనే ఈదారుణానికి ఒడిగట్టి వుంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.