Representational image (Photo Credit- Pixabay)

కోట, ఆగస్టు 28: రాజస్థాన్‌లో కోచింగ్‌ సెంటర్‌ హబ్‌గా పేరుపొందిన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 24కు చేరింది. తాజాగా కోటాలో గంటల వ్యవధిలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూడా వైద్య విద్యలో అర్హత కోసం నిర్వహించే నీట్‌ పరిక్షకు ప్రిపేర్‌ అవుతున్న 18 ఏళ్ల అవిష్కర్ శంబాజీ కస్లే, ఆదర్శ్ రాజ్‌గా గుర్తించారు. ఈ ఇద్దరి బలవన్మరణంతో సంఖ్య 24కు చేరింది.

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, జిల్లా యంత్రాంగం రెండు నెలల పాటు కోచింగ్ సెంటర్లలో పరీక్షలు మరియు పరీక్షలను వెంటనే అమలులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.కోటా జిల్లా యంత్రాంగం, మానసిక మద్దతు అవసరమని పేర్కొంటూ, రెండు నెలల పాటు పరీక్షలను నిలిపివేసింది.

ఆగస్టు 31 వరకు అన్ని విమానాలు రద్దు చేసిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్, తదుపరి ప్రకటన కోసం వేచి ఉండాలని ప్రయాణికులకు సూచన

"చదువుతున్న/రెసిడెన్షియల్ విద్యార్థులకు మానసిక మద్దతు, భద్రతను అందించడానికి, కోటాలో నిర్వహిస్తున్న అన్ని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎప్పటికప్పుడు నిర్వహించబడుతున్న పరీక్షలను రాబోయే రెండు నెలల పాటు నిలిపివేయాలని, ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి తీసుకురావాలి" అని ఆదివారం జిల్లా యంత్రాంగం ప్రకటన విడుదల చేసింది.అదే విధంగా గదుల్లోని ఫ్యాన్‌లకు యాంటీ సుసైడ్‌ డివైజ్‌లను ఇన్‌స్టాల్‌ చేయాలని సూచించారు. విద్యార్థులకు ఒకరోజు ఎలాంటి పరీక్షలు, తరగతులు నిర్వహించకుండా హాలీడే ఇవ్వాలని ఆదేశించారు.

గుండెపోటుతో కుప్పకూలి మరణించిన వ్యక్తి.. యూపీలోని లకీమ్ పూర్ లోని ఓ మాల్ లో ఘటన.. వీడియో ఇదిగో

మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లాకు చెందిన అవిశంకర్‌ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. గత మూడేళ్లుగా తల్వాన్డీ ప్రాంతంలో అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి అద్దె గదిలో ఉంటూ నీట్‌ యూజీకి సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కోచింగ్‌ సెంటర్‌లో పరీక్ష రాసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదే బిల్డింగ్‌లోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.వెంటనే ఇనిస్టిట్యూట్‌​ సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా మార్గమద్యలోనే ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే బిహార్‌కు చెందిన ఆదర్శ్‌ రాజ్‌ తన అద్దె గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. ఇతను కూడా పరీక్ష రాయగా.. అనంతరం రూమ్‌కు వచ్చి సాయంత్రం 7 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు.పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదర్శ్‌ తన బంధువులతో కలిసి ఉంటుండగా.. అతను కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇద్దరి వద్ద కూడా ఎలాంటి సుసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉండడంతో జిల్లా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే అన్ని హాస్టల్స్‌లో విద్యార్థులకు కౌన్సెలింగ్‌తోపాటు యోగా తరగతులు ప్రారంభించింది. ఫ్యాన్‌కు ఉరేసుకుని చాలా మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఫ్యాన్‌లను స్ప్రింగ్‌లకు బిగించారు. తాజాగా అన్ని హాస్టల్‌ భవనాలకు వలలు బిగించాలని జిల్లా యంత్రాంగం హాస్టల్‌ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.