 
                                                                 Ladakh, August 26: కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్త జిల్లాల పేర్లను కూడా అమిత్ షా ప్రకటించారు.జాంస్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, ఛాంగ్ థాంగ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదు కొత్త జిల్లాలతో లడఖ్ లో మొత్తం జిల్లాల సంఖ్య ఏడుకు చేరిందని చెప్పారు.
లడఖ్ సర్వతోముఖాభివృద్ధికి, ప్రజలకు మెరుగైన అవకాశాల కల్పన, మెరుగైన పాలన అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా మరోమారు పేర్కొన్నారు. అభివృద్ధి వైపు లడఖ్ చేస్తున్న ప్రయాణంలో కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం మరో ముందడుగు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. లడఖ్ వాసులకు ఆయన అభినందనలు తెలిపారు. కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారం కేసుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, దోషి ఎవరు అయినా తప్పించుకోకూడదని వెల్లడి
ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రభుత్వ సేవలను ఇంటి వద్దే పొందే అవకాశం లభిస్తుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు లడఖ్ సర్వతోముఖాభివృద్దికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. అయితే, లడఖ్ వాసులు తమకు రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తుండగా.. కేంద్రం మాత్రం మరో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయడం గమనార్హం.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
