CEC Rajiv Kumar (Photo Credit: X/ @rajivkumarec)

2024 లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. ఎన్నికల వేళ ఆయనకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్‌ బ్యూరో నివేదిక ఆధారంగానే భద్రత పెంచినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జెడ్‌ సెక్యూరిటీ భద్రతలో భాగంగా రాజీవ్‌ కుమార్‌ (సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌) సీఆర్పీఎఫ్‌ కమాండోల రక్షణలో 24 గంటలు ఉండనున్నారు. 40 నుంచి 45 మంది సీఆర్పీఎఫ్‌ కమాండోలు ఎల్లప్పడూ ఆయనకు భద్రత కల్పిస్తారని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

 Here's News