LPG Cylinder Price Hike: వినియోగదారులకు షాక్‌.. దేశంలో మళ్లీ ఎల్‌పీజీ సిలిండర్ ధర పెంపు, సిలిండర్‌కు రూ.50 చొప్పున పెంపు
LPG-cylinders

New Delhi, March 22: దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు మంగళవారం నుంచి పెరిగాయి.అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయ వంట గ్యాస్ ధర (LPG Cylinder Price Hike) మంగళవారం సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరిగింది. దీంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ( Cooking Gas Price Hiked) ఇప్పుడు ఢిల్లీలో రూ.949.50గా ఉంది. గత సంవత్సరం అక్టోబర్‌ తర్వాత ఎల్పీజీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్నప్పటికీ అక్టోబర్ ప్రారంభం నుంచి గ్యాస్‌ ధరలు పెంచలేదు.

పెంచిన ధరలతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349 కాగా, 10 కిలోల కాంపోజిట్ బాటిల్ రూ. 669గా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2003.50గా ఉంది. పెరిగిన గ్యాస్‌ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెంచిన ధరలతో తెలంగాణలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1000 దాటింది. పెట్రోల్, డీజిల్ తర్వాత దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది.

మళ్లీ రూ. 25 పెరిగిన డీజిల్ ధర, పెద్ద మొత్తంలో డీజిల్‌ను వినియోగించే బల్క్‌ యూజర్లకు షాకిచ్చిన చమురు కంపెనీలు

కోల్‌కతాలో వినియోగదారుడు సిలిండరుకు రూ.976 చెల్లించాల్సి ఉంటుంది.చెన్నైలో రూ.965.50లు, లక్నోలో రూ.987.50కి పెంచారు.పాట్నాలో కూడా ధరలు పెంచారు. పాట్నాలో ఎల్‌పిజి సిలిండర్ ఇప్పుడు రూ. 1,039.50కి విక్రయిస్తున్నారు.