Lucknow Horror: దారుణం, అనుమానంతో భార్య,ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త, మూడు రోజులు పాటు శవాల మధ్యనే పడుకున్న కసాయి
Image used for representational purpose | (Photo Credits: PTI)

Lucknow, April 1: యూపీలోని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యాపిల్లలను గొంతు నులిమి హత్య చేశాడు.అనంతరం ఆ మృతదేహాలతో మూడు రోజులు నిద్రించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బల్‌రామ్‌పూర్ జిల్లాకు చెందిన గౌతమ్‌ తన భార్య జ్యోతి(36), కుమార్తె(6), కుమారుడు(9)లతో లఖ్‌నవూలోని బిజ్నోర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. తన భార్యకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ తరచూ ఆమెతో గొడవపడేవాడు.ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పల్నాడులో దారుణం, సలసల కాగే నీటిని భర్త పురుషాంగంపై పోసిన భార్య, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన బాధితుడు

అదే రోజు రాత్రి భార్య నిద్రిస్తుండగా మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. అనంతరం పిల్లలను గొంతు నులిమి (Man kills wife, 2 children in house) చంపేశాడు. మరుసటి రోజు ఉదయం చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా ఇంటికి తాళం వేసి పనికి వెళ్లాడు. అలా అదే గదిలో మూడు రోజుల పాటు మృతదేహాల పక్కనే నిద్రించి ఉదయం పనులకు వెళ్లేవాడు. గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గది తాళం పగలగొట్టి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ (సౌత్) తేజ్ స్వరూప్ సింగ్ తెలిపారు.