Bhopal, Sep 12: కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో చాలామంది పనులు లేక ఆర్థికంగా బాధపడుతున్నారు. కస్టమర్లు కరోనా (Coronavirus) వల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చ సాహసం చేయకపోవడంతో వ్యాపారుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వీరిలో బార్బర్ (Barbers) పనిచేసే వాళ్లు కూడా ఉన్నారు. వీరికి ఉపాధి లేక రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా నిబంధనలు, జాగ్రత్తలు తీసుకోవడంతో కస్టమర్లలో ధైర్యం పెరిగి ఇప్పడిప్పుడు సెలూన్ షాపుకు (Hair Salon Shops) వస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో ఓ బార్బర్ (Madhya Pradesh Barber) సొంతంగా షాపు పెట్టుకోవడానికి డబ్బు లేకపోవడంతో మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాను (Forest minister Vijay Shah) సహాయం కోరాడు. చేస్తానని హమీ ఇచ్చిన మంత్రి ఇటీవల ఖండ్వా జిల్లాలోని గులైమాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి విజయ్ షా హాజరయ్యారు. అప్పుడు ఆ బార్బర్‌ను స్టేజ్ మీదకు పిలిచి తనకు హెయిర్‌కట్, షేవింగ్ చేయాలని కోరారు. తన ప్రతిభను ప్రదర్శించే సమయం ఆసన్నమైందని రోహిదాస్ చేతులకు శానిటైజర్, ఫేస్‌మాస్క్ ధరించి మంత్రికి హెయిర్ కట్ చేశాడు. తర్వాత షేవింగ్ కూడా పూర్తి చేశాడు.
Here's Video
A tribal gets financial assistance of ₹ 60,000 to open haircut salon after proving his skill on stage by haircut of Forest Minister Vijay Shah at Khandwa in MP! #AtmaNirbharBharat @News18India @CNNnews18 pic.twitter.com/iRFw8iCCbC
— Manoj Sharma (@ManojSharmaBpl) September 11, 2020
బార్బర్ పనితనం మెచ్చి విజయ్ షా స్టేజ్ మీదనే రూ. 60, 000 ఇచ్చారు. దీంతో సెలూన్ షాపు పెట్టుకోమని ఆదేశమిచ్చారు. హెయిర్ కట్ చేసే ముందు బార్బర్ జాగ్రత్త చర్యలు తీసుకుంటే కరోనా నుంచి ప్రజలు సురక్షితంగా ఉంటారనే భరోసా బార్బర్ కల్పించాలని మంత్రి కోరారు.