Samosa Price Dispute: సమోసా ధర వివాదంలో పోలీసుల వేధింపులు, తట్టుకోలేక పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి, మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన
Representational Image (Photo Credits: ANI)

Bhopal, July 27: మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సమోసా ధర వివాదంలో (Dispute over price of Samosa) యువకుడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిల్లో చికిత్స పొందుతూ (death of a man in Anuppur ) మరణించాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ అనుప్పూర్ లో (Anuppur) జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ లోని అమర్కాంటక్ పట్టణ (Amarkantak town) సమీపంలో గల అనుప్పూర్లో కాంచన్ సాహూ అనే వ్యక్తి దుకాణం నడుపుతున్నాడు.

ఆ దుకాణ దారుని దగ్గర బజ్రూ జైస్వాల్ అనే వ్యక్తి సమోసాలు కొనుగోలు చేశాడు. సమోసాలు ధర రూ. 15 అయితే రూ. 20 ఇవ్వాలని దుకాణదారుడు అతనిని కోరాడు. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి అంత ఎందుకు ఇవ్వాలంటూ దుకాణదారునితో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం తీవ్రం కావడంతో దుకాణదారుడైన సాహు కొనుగోలు చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని 294, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పెళ్లయి మూడేళ్లయినా శోభనం లేదు, తీరా చూస్తే భర్త స్వలింప సంపర్కుడు, విడాకులు కావాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న బాధిత భార్య, కర్ణాటకలో ఘటన

దర్యాప్తులో భాగంగా కొనుగోలుదారుడైన నిందితుడను పోలీసులు పలుమారు స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారు. విచారణ సమయంలో అతనిపై వేధింపులకు దిగారు. ఈ వేధింపులు తట్టుకోలేని కొనుగోలు దారుడు పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. అతనిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. ఆస్పత్రికి తరలించే సమయంలో అతని వాంగ్మూలాన్ని కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా రికార్డు చేశారు.

Here's ANI Update

కుటుంబ సభ్యులు రికార్డింగ్ చేసిన దానిలో బాధితుడు పోలీసులు, ఫిర్యాదుదారుడ అనబడే దుకాణదారుడు వేధింపులకు గురి చేశారని అది తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని SDOP ఆశిష్ భరండే తెలిపారు.