
Bhopal, May 18: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పెళ్లిలో వధూవరులు విషం తాగారు (Consuming Poison At Wedding). పెళ్లికొడుకు మరణించగా, పెళ్లికుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నది. ఆమె ప్రాణాలతో పోరాడుతున్నది. కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్ ఆలయంలో 21 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల యువతితో మంగళవారం పెళ్లి జరుగుతున్నది. అయితే వివాహం సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ నేపథ్యంలో తొలుత పెళ్లికుమారుడు విషం తాగాడు. పెళ్లికుమార్తెకు ఈ సంగతి చెప్పాడు. దీంతో ఆమె కూడా విషం తాగింది. గమనించిన బంధువులు వెంటనే వారిద్దరినీ స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే వరుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వధువు పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వెల్లడించారు. ఉద్యోగం వచ్చే దాకా పెళ్లి వాయిదా వేయమంటే పెళ్లి కూతురు ఒప్పుకోలేదని అందుకే విషం తాగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.