Liquor (Photo Credits: PTI)

Morena, January 12: మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో తీరని విషాదం ఘటన చోటు చేసుకుంది. కల్తీమద్యం తాగి 10 మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి మరింత విషమంగా (10 Dead, 7 Hospitalised) ఉందని వైద్యులు తెలిపారు. కల్తీమద్యం ఘటన (Madhya Pradesh Hooch Tragedy) మోరెనాలో కలకలం రేపింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు, వైద్య అధికారులు ఘటనకు గల కారణాలను అనేష్విస్తున్నారు. ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశిచింది. బాధితులు చెహ్రా మాన్‌పూర్, పెహ్‌వాలీ ప్రాంతాల‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

సమచారం అందుకున్న ఎస్పీ అనురాగ్‌ సుజనీయ సంఘటనాస్థలికి చేరుకుని మద్యం షాపు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే స్థానికులు తెలుపుతున్న సమచారం ప్రకారం.. మోరానా సమీపంలోని ఓగ్రామీణ ప్రాంతానికి చెందిన వీరంతా స్వతహాగా మద్యం తయారు చేసుకుని తాగారని, ఆ తరువాత ఒక్కరికీ వాంతులు, కళ్లు తిరగడం ప్రారంభమయ్యాయని తెలిపారు. వారందరినీ ఆస్పత్రికి తరలించే క్రమంలో 11 మంది మృతి చెందినట్లు చెప్పారు.

తెలంగాణలో కల్తీ కల్లు కల్లోలం, వికారాబాద్‌లో దాదాపు 200 మందికి పైగా అస్వస్థత, ఒకరు మృతి, కల్లు దుకాణాలు, డిపోను సీజ్ చేసిన అధికారులు, ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపిన ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషీ

కాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో గ‌త ఏడాది అక్టోబరులో కూడా కల్తీ మద్యం కార‌ణంగా 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న మ‌ర‌వక ముందే మ‌రోసారి అటువంటి ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో క‌ల్తీ మ‌ద్యం అనేక ప్రాంతాల్లో ల‌భ్య‌మ‌వుతున్న‌ప్ప‌టికీ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.