Rats ate weed Representative Image from Google

మధ్యప్రదేశ్‌లో పోలీసులు ఎలుకను అరెస్టు చేశారు.చిన్న బోనులో బందించి పోలీసు స్టేషన్‌లోనే ఓ మూలన ఉంచారు. పోలీసు గోదాంలో ఉన్న మద్యం బాటిళ్లను ఎలుకలు ఖాళీ చేసిన కారణంగా దానిని బంధించినట్లు పోలీసులు చెబుతున్నారు. న్యూస్ వివరాల్లోకెళితే.. రాష్ట్రంలో చింద్వారా, కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 60 బాటిళ్ల లిక్కర్‌ సీజ్‌ చేశారు.

సీజ్ చేసిన బాటిళ్లకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానంలో సాక్ష‍ంగా చూపించాల్సి ఉంది. అయితే ఈ మందు బాటిళ్లను తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. ఇంకేముంది పీఎస్‌లోకి వచ్చిన ఎలుకలు మొత్తం లిక్కర్‌ తాగేశాయని పోలీసులు చెబుతున్నారు. బాటిళ్లు ఖాళీ అయ్యాయన్న బాధ కంటే అక్రమ మద్యం కేసు నిరూపించడం ఇక కష్టమని పోలీసులు ఆవేదన చెందుతున్నారు.

దారుణం, టీ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన డాక్టర్, మరో వైద్యుడిని పిలిచి ఆపరేషన్లు చేయించిన యాజమాన్యం

ఏం చేయాలో తెలియక ఎలుకలను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. చాలా ఎలుకల్లో ఒక్క ఎలుక మాత్రమే దొరికిందని తెలిపారు. మిగితావి పరారీలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి. పలు ప్రభుత్వ పత్రాలను కూడా ధ్వంసం చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల శరీరాన్ని కొరికి తిన్న ఘటనలు కూడా వెలుగుచూశాయి.

కేవలం కొత్వాలి పోలీస్‌స్టేషనే కాదని, అక్కడున్న అన్ని ప్రభుత్వ ఆఫీసు భవనాలకు ఎలుకలు, చెదల బాధ తప్పడం లేదని, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా వాటిని వదిలించుకోవడం తమ వల్ల కావడం లేదని ఓ అధికారి వాపోయారు.