మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తమ కుటుంబానికి చెందిన 8 మందిని గొడ్డలితో దారుణంగా నరికి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌కు చెందిన చింద్వారా జిల్లాలోని బోదల్ కచ్చార్ గ్రామంలో జరిగింది. కుటుంబసభ్యులను హత్య చేసిన వ్యక్తికి మానసికంగా స్థిమితంగా లేనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి చింద్వారా కలెక్టర్, ఎస్పీ వెళ్లారు. ఈ ఘటన పట్ల పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వీడియో ఇదిగో, సహనం కోల్పోయిన భారత షూటర్, క్యాబ్ డ్రైవర్‌పై తుఫాకీతో విచక్షణారహితంగా దాడి
మంగళవారం రాత్రి కుటుంబసభ్యులపై గొడ్డలితో అటాక్ చేసినట్లు ఎస్పీ ఖత్రి తెలిపారు. సోదరుడు, కోడలు, భార్యతో పాటు మరో చిన్నారిని కూడా ఆ వ్యక్తి హత్య చేశాడు. అందర్నీ హత్య చేసిన తర్వాత ఆ వ్యక్తి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆ కుటుంబానికి చెందిన ఒక్క చిన్నారి మాత్రమే ఆ దాడిలో గాయాల వల్ల బయటపడింది. ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఏ కారణం చేత ఆ వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడో తెలియదు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.