Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Jabalpur, Dec 15: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని జ‌బ‌ల్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 11 ఏండ్ల బాలిక ఆ బాలిక తండ్రి స్నేహితుల చేతిలో అత్యాచారానికి (Minor girl gang-raped) గురయింది. మైనారిటీ కూడా తీర‌ని స్నేహితుడి కుమార్తెపై (Minor girl gang-raped by her fathers) రెండు మాన‌వమృగాలు అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాయి. 11 ఏండ్ల బాలిక ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో స్నేహితుడి ఇంట్లో చొర‌బ‌డిన ఈ కామాంధులు తమ కామవాంఛలను తీర్చుకున్నారు.

దారుణ ఘటన వివరాల్లోకెళితే.. జ‌బ‌ల్‌పూర్ జిల్లాలోని రాంజీ పోలీస్‌స్టేష‌న్ (Ranjhi police station) ప‌రిధిలో ఈ నెల 7న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా ఈ నెల 11న‌ వెలుగుచూసింది. అఘాయిత్యాన్ని చూసిన ప‌క్కింటి మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారు బాలిక ఇంటికి చేరుకుని ఆరా తీశారు. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి భ‌యంతో వ‌ణికిపోతున్న‌ బాలిక‌కు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఘ‌ట‌నపై గురించి ఆరా తీశారు. బాధితురాలు ఇచ్చిన స‌మాచారం మేర‌కు నిందితుల‌పై కేసు న‌మోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

పనికి రాలేదని పిల్లల ముందే రేప్, గర్భంతో ఉన్న మహిళపై రాడ్లతో దాడి, మధ్యప్రదేశ్​ ఛాతర్​పూర్ జిల్లా బండార్​ఘడ్ గ్రామంలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

నిందితుల్లో ఒక‌రి వ‌య‌సు 25 ఏండ్లు, మ‌రొక‌ని వ‌య‌సు 26 ఏండ్లు అని జిల్లా అద‌న‌పు ఎస్పీ సంజ‌య్ అగ‌ర్వాల్ తెలిపారు. బాధితురాలు తండ్రితో పాటు నిందితులిద్ద‌రూ కూలీలుగా ప‌నిచేసేవార‌ని, ఈ క్ర‌మంలోనే తండ్రి లేని స‌మ‌యం చూసి బాలిక‌పై అఘాయిత్యం చేశార‌ని తెలిపారు. నిందితుల‌పై పోక్సో చ‌ట్టంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద కూడా కేసులు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు.