Chhatarpur, May 30: మధ్యప్రదేశ్ ఛాతర్పూర్ జిల్లా బండార్ఘడ్ గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. పొలం పనులకు రాలేదని ఓ దళిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులను అపహరించి నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు.
అయితే నిందితుడు తనపై లైంగిక దాడి (Raped by Village Muscleman in Chhatarpur) చేశాడని.. తన పిల్లల ముందే ఈ దారుణానికి పాల్పడ్డాడని కార్మికుడి భార్య ఆరోపించింది. గర్భంతో ఉన్న మహిళపై రాడ్లతో దాడి (regnant Dalit Woman Allegedly Thrashed) చేశారు. ఆపై మూడు రోజులు ఇంట్లోనే బంధించారు. ఆలస్యంగా ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామంలో స్వర్ణ కులానికి చెందిన ఓ వ్యక్తి, బాధిత కుటుంబాన్ని పొలం పనులకు రావాలని పిలిచాడు. అయితే వేరే పనులు ఉండడం, అనారోగ్యం కారణంగా తర్వాత వస్తామని వాళ్లు చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి కొందరిని వెంటేసుకుని ఆ ఇంటికి వెళ్లాడు. బాధిత మహిళను, ఆమె అత్తను కులం పేరుతో దూషిస్తూ.. దాడికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లో మగవాళ్లను చంపుతామని బెదిరించాడు.
మూడు రోజులపాటు ఇంట్లోనే బంధించి.. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి వదిలేశారు. అయితే కొందరు యువకుల సాయంతో విషయం పోలీసులకు చేరడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్తో మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని రాజ్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పంకజ్ శర్మ తెలిపారు. కాగా, ఈ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిగిందని దళిత సంఘాలు సోషల్ మీడియాలో ఉద్యమిస్తున్నాయి.
ఐదు రోజులు ఆ కుటుంబం నరకం అనుభవించిందని, పిల్లల కళ్లెదుటే ఆమెపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించకపోగా.. కేసు దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు.