electrocuted representational pic (Pic Credit: Pixabay)

Chhatarpur, July 11: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్‌పూర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చూ​స్తుండగానే రెప్పపాటులో కుటుంబం మొత్తం తిరిగిరాని లోకాలకు (Six Family Members Electrocuted to Death) వెళ్లిపోయింది.ఆ క్ష‌ణం వ‌ర‌కు ప్రాణాలతో కళకళలాడుతున్న ఆ కుటుంబంలోని స‌భ్యులంతా ఒకేసారి విగ‌త‌జీవులుగా మారారు. కరెంట్‌ షాక్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు ప్రాణాలు (Six Family Members Electrocuted) గాల్లో కలిసాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. బీజావ‌ర్ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మహాజ్వాలా గ్రామంలో ఓ ఇంట్లో సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మాణం జరుగుతోంది.

ఈ క్రమంలో ఆ ఇంట్లోని ఒకరు పైకప్పు స్లాబ్ వేయడానికి ఉపయోగించే షట్టర్ ప్లేట్లను తొలగించడానికి ట్యాంక్‌లోకి దిగారు. అయితే, ట్యాంక్‌లో లైటింగ్ ఏర్పాట్ల కారణంగా, కరెంట్‌ ఆ పలకలపైకి వ్యాపించడంతో ఆ వ్యక్తి కరెంట్‌ షాక్‌కు గురికాగా.. అతడిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఐదుగురు కుటుంబ సభ్యులు కూడా కరెంట్‌ షాక్‌కు గురయ్యారు.

చికిత్స కోసం వెంటనే ఆ ఆరుగురిని ఆస్పత్రికి తరలించగా, వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా మృతులు 20 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని పోలీసులు తెలిపారు.

మహబూబాబాద్‌లో విషాదం, విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు దుర్మరణం, మరోచోట కూక‌ట్‌ప‌ల్లిలోని ప్ర‌శాంత్ న‌గ‌ర్ పారిశ్రామిక‌వాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం

మృత‌దేహాలను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌కు సంబంధించి, మృతుల‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు. అప్ప‌టిదాకా ఇరుగుపొరుగుతో క‌లిసి మెలిసి ఉన్న కుటుంబంలోని ఆరుగురు స‌భ్యులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవ‌డంతో స్థానికంగా విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.