AP Chief Minister YS Jagan | File Photo

Amaravati, Oct 29: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతికుర్రు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో (konaseema dontikurru high school) ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు క్షేమంగా ఉన్నారు. ఒక విద్యార్థి మృతి (electrocuted third class student died) చెందగా మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.

వీరిని 108లో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. హైస్కూలు సమీపంలో నిర్మాణంలో ఉన్న పంచాయతీ భవన నిర్మాణం కోసం ఐరన్ పనుల కోసం స్కూల్ నుంచి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారు. ఈ కనెక్షన్ తొలగించకపోవడంతో విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండుగా ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు. స్థానిక ఎస్ఐ టి.శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సచివాలయ స్లాబ్ కోసం ఐరన్ కట్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

విద్యార్థులకు కరెంట్‌ షాక్‌ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి శుక్రవారం ఆయన రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు.

సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ కీలక నిర్ణయం, కొత్తగా 809 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీలో..

విద్యుదాఘాతానికి గురై యడ్ల నవీన్‌ (7) అనే మూడో తరగతి విద్యార్థి మృత్యువాత పడ్డాడు.చిట్టిమేను వివేక్‌ (3వ తరగతి), తిరుపతి ఘన సతీష్‌కుమార్‌ (4వ తరగతి)లను అత్యవసర వైద్యం నిమిత్తం అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దరు 3వ తరగతి విద్యార్థులు మొల్లేటి నిఖిల్, బొంతు మహీధరరెడ్డిలకు దొంతుకుర్రులోనే ప్రాథమిక వైద్యం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న సచివాలయ భవనం శ్లాబ్‌ కోసం ఇనుప ఊచలను కట్‌ చేసేందుకు కటింగ్‌ మెషీన్‌ తీసుకొచ్చారు. దాని తీగ ఊచలకు తగలడం.. అదే సమయంలో విద్యార్థులు తాగునీటి కోసం ఆ ఇనుప ఊచలపై నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ఇక సతీష్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, జిల్లా ఏఎస్పీ కె.లతామాధురి పరామర్శించి, పరిస్థితిని సమీక్షించారు. మృతిచెందిన విద్యార్థి నవీన్‌ కుటుంబీకులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.