Bhopal, SEP 01: సెక్యూరిటీ గార్డులే (Security Gaurd) వాడి టార్గెట్.. సుత్తి, రాళ్లే ఆయుధాలు.. మూడు రాత్రుల్లో మూడు హత్యలు.. మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh) సాగర్ నగరంలో వరుస హత్యలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కొంతకాలంగా సాగర్ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న మర్డర్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాత్రివేళ నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులనే లక్ష్యంగా చేసుకుంటూ హంతకుడు దారుణాలకు పాల్పడుతున్నాడు. సుత్తి, బండరాళ్లతో తలపై మోదుతూ హత్యలు చేస్తున్నాడు. కొన్నిసార్లు హత్యలకు ఉండే కొయ్య పిడిని కూడా ఉపయోగిస్తున్నాడు. అంతేకాదు, హత్య జరిగిన చోట “పట్టుకోండి చూద్దాం” అంటూ సవాల్ చేస్తూ కొన్ని కార్డులను కూడా వదిలాడు.

ఇప్పటిదాకా నాలుగు ఘటనలు ఒకే విధంగా జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనల్లో ముగ్గురు చనిపోగా, నాలుగో వ్యక్తి పుర్రె పగిలిపోయి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఆ సీరియల్ కిల్లర్ (Serial Killer)రెండు రోజుల వ్యవధిలో రెండు హత్యలు చేయడంతో సాగర్ (Sager) ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ వరుస హత్యలు పోలీసులకు సవాల్ గా మారాయి. సంఘటన స్థలంలో కీలక ఆధారాలేవీ లభ్యం కాకపోవడంతో, పోలీసులు పాత కేసులను తిరగదోడుతున్నారు. హంతకుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ సుధీర్ సక్సేనా తెలిపారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో మఫ్టీలో ఉన్న సాయుధ పోలీసులను నియమించామన్నారు.

మంగళవారం ఉదయం స్థానికులు 60ఏళ్ల దూబే డెడ్ బాడీని గుర్తించారు. సాగర్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ క్యాంటీన్ దగ్గర అతడి మృతదేహం ఉంది. అతడో సెక్యూరిటీ గార్డు. నిద్రలో ఉండగానే దూబేని హత్య చేశాడు. రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ బృందం రక్తపు మరకలు ఉన్న రాయిని గుర్తించింది. అలాగే దూబే డెడ్ బాడీ సమీపంలో మొబైల్ ఫోన్ గుర్తించారు. అందులో సిమ్ కార్డు లేదు. అయితే టెక్నాలజీ సాయంతో ఆ ఫోన్ 57ఏళ్ల కళ్యాణ్ లోధీకి చెందినదిగా గుర్తించారు. కళ్యాణ్ లోధీ కూడా సెక్యూరిటీ గార్డే. అతడు కూడా గత రాత్రి ఓ ఫ్యాక్టరీ దగ్గర హత్యకు గురయ్యాడు. ఇక మంగళవారం రాత్రి మంగళ్ అహిర్ వార్ అనే సెక్యూరిటీ గార్డుపైనా దాడి జరిగింది. దుండగుడి దాడిలో అతడి పుర్రె పగిలి చనిపోయాడు. సాగర్ ప్రాంతంలోని మోతీ నగర్ లో డ్యూటీకి వెళ్తుండగా అతడిపై సీరియల్ కిల్లర్ దాడి చేశాడు.

Murugha Mutt Seer Sex Scandal: మైన‌ర్ బాలిక‌ల‌పై స‌న్యాసి లైంగిక దాడి, మ‌ఠాధిప‌తి శివ‌మూర్తి మురుగపై లుక్అవుట్ నోటీసు జారీ చేసిన క‌ర్నాట‌క పోలీసులు 

సీరియల్ కిల్లర్ దాడిలో గాయపడ్డ బాధితుడు చెప్పిన వివరాలు, హత్యలు జరిగిన ప్రదేశాల్లోని సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు పోలీసులు దుండగుడి స్కెచ్ విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.20వేలు నగదు బహుమతి ప్రకటించారు.

Madhya Pradesh Shocker: వైద్యం అందక తల్లి ఒడిలోనే కన్నుమూసిన ఐదేళ్ల బాలుడు, మధ్యప్రదేశ్‌లో దారుణం, ఐదు నిమిషాల్లో రావాల్సిన డాక్టర్..ఎంత సేపటికీ రాకపోవడంతో నిస్సహాయంగా ఎదురుచూసిన తల్లి 

ప్రజలను ఎలా రక్షించాలి? హంతకుడిని ఎలా పట్టుకోవాలి? దీనిపై పోలీసులు పని చేస్తున్నారు. కిల్లర్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సాగర్ జిల్లా ఎస్పీ తెలిపారు. “ఒక అనుమానితుడి గురించిన సమాచారంతో ఒక పోలీసు బృందం నిన్న అర్థరాత్రి అడవిలో దాడి చేసింది. సీసీకెమెరాలు ఉన్న వారందరినీ గత కొన్ని రోజుల ఫుటేజీని తనిఖీ చేయాలని కోరాము. ఏదైనా నేరం జరిగుంటే మా దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాము” అని పోలీసులు తెలిపారు.

వరుస హత్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. “సాగర్ జిల్లా మొత్తం పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సాగర్‌లో రాత్రి పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేశాం. నైట్ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులను అలర్ట్ చేశాము. ఇప్పటివరకు విశ్లేషించిన సీసీ కెమెరాల నుండి ఒక వ్యక్తి పరిగెత్తుతున్నట్లు కనిపిస్తున్నాడు. కొనసాగుతున్న విచారణలో ఈ హత్యలు చేస్తున్నది ఒక వ్యక్తి కావచ్చని సూచిస్తోంది” అని మంత్రి అన్నారు.

మధ్యప్రదేశ్ లో గతంలోనూ వరుస హత్యలు జరిగాయి. ఆదేశ్ ఖమ్రా అనే వ్యక్తి కేవలం ట్రక్కు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని హత్యాకాండ సాగించాడు. ఖమ్రా ఏకంగా 34 మందిని పొట్టనబెట్టుకున్నాడు. దేశంలోనే భయానక సీరియల్ కిల్లర్ గా పేరుపొందాడు. పగటివేళ ఎంతో సామాన్యుడిలా, అందరితో కలిసిమెలిసి తిరిగే ఆదేశ్ ఖమ్రా… రాత్రి అయితే చాలు… నరరూప రాక్షసుడిలా మారిపోతాడు. అతడిని 2018లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు సాగర్ ఏరియాలో జరుగుతున్న వరుస హత్యల నేపథ్యంలో, ప్రజలు నాటి హత్యాకాండను గుర్తుచేసుకుని హడలిపోతున్నారు.