Mumbai, June 5: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఈ దఫా కేవలం 9 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 2019 ఎన్నికల్లో 23 సీట్ల వరకు గెలుచుకున్న బీజేపీ ఈ దఫా కేవలం 9 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ క్రమంలోనే బీజేపీ ఓటమికి తాను బాధ్యత తీసుకుటానంటూ ఏకంగా తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు ఆ పార్టీ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.
‘‘రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోవడానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. అసలు తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టి దానిని పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. నేను పారిపోయే వ్యక్తిని కాదు. బాధ్యత తీసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేసే వ్యక్తిని. అతి త్వరలో కొత్త ప్రణాళికలను రూపొందించి.. వాటితోనే తిరిగి ప్రజల్లోకెళతాం. వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా తిరిగొస్తాం’’ అని ఫడ్నవిస్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు, వైద్య పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు
కాగా.. లొక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో బీజీపీ సింగిల్ హ్యాండ్‌తో 330 సీట్లకు పైగా కొల్లగొట్టగా.. ఈ దఫా అది 240కి పడిపోయింది. అయితే బీజేపీ భారీగా సీట్లు కోల్పోయిన రాష్ట్రాల్లో యూపీ, బెంగాల్, మహారాష్ట్ర, బీహార్ టాప్‌లో ఉన్నాయి. 2019తో పోల్చితే యూపీలో 29 సీట్లు, మహారాష్ట్రలో 14 సీట్లు, బిహార్‌లో 5 సీట్లు అధికంగా కోల్పోయింది. ఇవి కాకుండా ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో భారీగా సీట్లు కోల్పోయాయి.