Mumbai, Feb 24: రైతులు పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు ఇంతకన్నా మరో ఉదాహరణ ఉండదు. మహారాష్ట్ర షోలాపూర్‌లోని ఓ రైతుకు (farmer in Solapur) రవాణా ఛార్జీలు మినహాయించి 10 బస్తాల ఉల్లిని విక్రయించగా రూ.2 చెక్కు ( cheque for Rs 2) వచ్చింది. ఆ రోజు ఉత్పత్తి నాణ్యత తక్కువగా ఉండటం & ఉల్లిపాయల ధరలు తక్కువగా ఉండటంతో రైతుకు వాస్తవానికి క్వింటాల్‌కు రూ. 100 హక్కు ఉందని మండి వ్యాపారి చెప్పారు. అయితే కేవలం రెండు రూపాయలు చేతిలో పెట్టారు.
నేను 2 ఎకరాల భూమిలో ఉల్లిపాయలు పండించాను. 10 బస్తాల ఉల్లిపాయలను (selling 10 sacks of onion) విక్రయించడానికి షోలాపూర్ మండికి వెళ్లాను. తూకం వేసిన తర్వాత రూ.2 చెక్కు ఇచ్చారు. పంట పండించేందుకు అప్పు తీసుకున్నాను. నేను దానిని ఎలా తిరిగి చెల్లించగలను? ఉల్లిని మండీకి తీసుకురావడానికి రూ.400 ఖర్చు అయిందని రైతు కుమారుడు అన్న రాజేంద్ర చవాన్ కంటతడి పెట్టారు.
Here's ANI Tweet
I had grown onions on 2 acres of land & went to Solapur mandi to sell 10 sacks of onion. After weighing, I was given a cheque for Rs 2. I had taken a loan. How will I pay it back? It cost Rs 400 to bring the onion to the mandi: Anna Rajendra Chavan, the farmer's son pic.twitter.com/ueuNU8yzyD
— ANI (@ANI) February 24, 2023
దీనిపై వ్యాపారి నసీర్ ఖలీఫా స్పందించారు. ఉత్పత్తిని తూకం వేసిన తర్వాత, కంప్యూటర్ రోజు ధరల ప్రకారం చెల్లింపును నిర్ణయిస్తుంది. అతను 10 బస్తాల ఉల్లిపాయలను విక్రయించాడు & అందులో కొన్ని కుళ్ళిపోయాయి, కాబట్టి అతను రవాణా ఛార్జీల మినహాయింపు తర్వాత తక్కువ ధరను పొందాడు. అతను మాకు ఉత్పత్తులను అనేక సందర్భాల్లో విక్రయించి రూ. 2,30,139 అందుకున్నాడని తెలిపారు.