Maharashtra Road Accident. (Photo Credits: ANI)

Wardha, January 25: మహారాష్ట్రలో సోమవారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వార్ధాలొ జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడితో సహా ఏడుగురు వైద్యవిద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు ఆవిష్కర్ తోపాటు ఏడుగురు వైద్య విద్యార్థులు (7 Medical Students Killed) సెల్సురా గుండా కారులో వెళుతుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు సెల్సురా నుంచి అడవి గుండా వెళుతుండగా అకస్మాత్తుగా ఓ జంతువు కనిపించింది.

జంతువును తప్పించేందుకు చక్రాన్ని తిప్పడంతో కారు కల్వర్టు కింద ఉన్న గుంతలో (Car Falls from Bridge Near Selsura) పడి పోయింది. ఈ ఘటనలో ఏడుగురు వైద్యవిద్యార్థులు మరణించారని వార్ధా ఎస్పీ ప్రశాంత్ హోల్కర్ చెప్పారు. మృతుల్లో తిరోరా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ (BJP MLA Vijay Rahangdale) కుమారుడు ఆవిష్కర్ కూడా ఉన్నారు.ఇతర బాధితులను నీరజ్ చౌహాన్, నితేష్ సింగ్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్, పవన్ శక్తిగా గుర్తించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఏడుగురు వైద్యవిద్యార్థులు మరణించిన ఘటన వార్ధాలో విషాదాన్ని నింపింది.

ఇంత దారుణమా..లావుగా ఉన్నాడని ఉద్యోగం నుంచి తీసేశారు, పని సమర్ధతను చూపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన చెందిన ఉద్యోగి

పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ హోల్కర్ మాట్లాడుతూ..డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో మహీంద్రా XUV 500 వంతెనపై నుండి పడిపోవడంతో ప్రమాదం జరిగింది. SUV డియోలీ నుండి వార్ధాకు వెళుతోంది. అడవి పంది వారి వాహనాన్ని ఢీకొనడంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. కాగా వార్ధా పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విద్యార్థులు తమ పరీక్షలు ముగించుకుని పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతి చెందిన విద్యార్థులను గోండియా జిల్లాలోని తిరోరా నియోజకవర్గం ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు ఆవిష్కర్, నీరజ్ చౌహాన్ (ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం), నితేశ్ సింగ్ (2015 ఇంటర్న్ ఎంబీబీఎస్), వివేక్ నందన్ (2018, ఎంబీబీఎస్ ఫైనల్), ప్రత్యూష్ సింగ్ (2017)గా గుర్తించారు. MBBS), శుభమ్ జైస్వాల్ (2017 MBBS), మరియు పవన్ శక్తి (2020 MBBS)గా పోలీసులు గుర్తించారు.