ఏ కంపెనీ అయిన ఉద్యోగి టాలెంట్‌ని పరిగణలోకి తీసుకునే ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుంది.అయితే ఆస్ట్రేలియాలో లావుగా ఉన్నందుకు ఓ వ్యక్తిని విధుల నుంచి తొలగించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి తన ఇంటికి 3,200 కిలోమీటర్ల దూరంలో తన కొత్త ఉద్యోగంలో చేరిన రెండు గంటలకే 'చాలా లావుగా' ఉన్నందుకు (Man Fired For Being Too Fat) తనను తొలగించారని చెప్పారు.
అసలు విషయంలోకెళ్తే...ఆస్ట్రేలియాకు చెందిన హమీష్ గ్రిఫిన్ (Hamish Griffin) క్వీన్స్‌లాండ్‌లో ఎనిమిదేళ్లుగా పార్క్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పైగా అతని సొంత ఇంటికి ఆఫీస్ సుమారు 3,200 కి.మీ దూరం. కాగా అతను ఇటీవలే ఆఫీస్‌కి దగ్గరగా ఉండేలా ఇల్లు కూడా మారాడు. అయితే ఉన్నట్టుండి అతని కంపెనీ యజమాని నువ్వు చాలా లావుగా ఉన్నావు పనిచేయలేవు అని చెప్పి విధుల నుంచి తొలగించేశారు. ఈ మేరకు గ్రిఫిన్ మాట్లాడుతూ..."కనీసం నా పని సమర్ధతను చూపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.
కేవలం నేను లావుగా ఉన్నాను కాబట్టి ఏ పనిచేయలేను అని నిర్ణయించారు. పైగా నాకు ఒక కొడుకు ఉన్నాడు. నా ఉద్యోగం పోవడం వల్ల ఈ ఏడాది అతని చదువు ఆగిపోతుంది." అని ఆవేదన వ్వక్తం చేశాడు. అయితే ఆరోగ్య కారణాలతో తొలగించడం వివక్షత కిందకే వస్తుందని లాయర్లు చెబుతున్నారు. ప్రస్తుతం తన ఆస్తులను అమ్ముకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు.
కాగా అతని యజమానులు పార్క్‌లోని షెడ్ నుండి సోఫాను తరలించమని అడిగినప్పుడు అతని బరువు సమస్య కావచ్చునని హమీష్ పేర్కొన్నాడు. నేను చాలా లావుగా ఉన్నందున నేను ఉద్యోగం చేయలేనని నాకు చెప్పారు. నేను లాన్‌మవర్‌ను నెట్టలేనని లేదా నిచ్చెన ఎక్కలేనని నాకు వారు చెప్పాడు. నేను వాయువ్య క్వీన్స్‌లాండ్‌లో ఎనిమిదేళ్లుగా పార్క్ మేనేజర్‌గా ఉన్నాను - నేను 'ఎనిమిదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను," అని తండ్రి ABCకి చెప్పారు. ఈ విషయాన్ని అతను ఫేస్‌బుక్ పోస్ట్‌లో పోస్ట్ చేశాడు.