Rainfall (Photo Credits: IANS|File)

Mumbai, Sep 28: మహారాష్ట్ర‌లో గ‌త రెండు రోజుల నుంచి కుండపోత వ‌ర్షాలు ( Heavy rains ) కురుస్తున్నాయి. ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాల ధాటికి (Maharashtra Rains) జ‌నం విల‌విల్లాడుతున్నారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌ కార‌ణంగా మ‌హారాష్ట్ర‌లోని మ‌రాఠ్వాడా రీజియ‌న్‌లో ఇప్ప‌టికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేగాక దాదాపు 200పైడా ప‌శువులు కొట్టుకుపోయాయి. ప‌లు ఇండ్లు దెబ్బ‌తిన్నాయి. మ‌రాఠ్వాడా రీజియ‌న్‌లోని ఎనిమిది జిల్లాలు, 180 స‌ర్కిళ్ల‌లో రికార్డు స్థాయిలో 65 మిల్లీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది.

మ‌ర‌ణించిన 10 మందిలో మ‌రాఠ్వాడా రీజియ‌న్‌లోని (Marathwada Region) ఆరు జిల్లాల‌కు చెందినవారు ఉన్నారు. బీడ్ జిల్లాకు చెందిన ముగ్గురు, ఉస్మానాబాద్‌, ప‌ర్భ‌ణి జిల్లాల‌కు చెందినవారు ఇద్ద‌రు చొప్పున ఉన్నారు. ఇక జ‌ల్నా, నాందేడ్‌, లాటూర్ జిల్లాల‌కు చెందిన వారు ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు. మిగితా రెండు జిల్లాలైన ఔరంగాబాద్‌, హింగోలిలో ఇప్ప‌టివ‌ర‌కు మ‌ర‌ణాలు నమోదు కాలేదు.

తెలుగు రాష్ట్రాలను వణికించిన గులాబ్ తుఫాన్, తెలంగాణలో 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా, అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవు, ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపిన సైక్లోన్ గులాబ్

మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లాలో వంతెనను దాటుతున్న సమయంలో ఆర్టీసీకి చెందిన బస్సు మంగళవారం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. ఉమర్‌ఖేడ్ తహసీల్‌లోని దహ్‌గావ్ వంతెన వద్ద ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు నాగ్‌పూర్ నుంచి నాందేడ్ వెళ్తోంది. నీటితో నిండిన వంతెనను దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బస్సు సుమారు 50 మీటర్ల దూరం కొట్టుకువెళ్లి బోల్తాపడిందని అధికారులు పేర్కొన్నారు.

Here's Bus washed away Video

గతకొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉప్పొంగి వంతెనపైకి నీరు చేరింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు ఉన్నారని ఉమర్‌ఖేడ్‌ తహసీల్దార్‌ ఆనంద్‌ డియోల్గావ్‌ పేర్కొన్నారు. వరద ఉధృతికి బస్సు కొట్టుకుపోతున్న సమయంలో ఇద్దరు ప్రాణాలను కాపాడుకున్నారు. ఆ తర్వాత గల్లంతైన నలుగురిలో ఒకరిని రక్షించి, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ముగ్గురికి కోసం గాలిస్తున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు తెలిపారు.