Mumbai, May 18: అనుమానంతో భర్త పెట్టే వేధింపులు భరించలేక ఒక భార్య తన భర్త జననాంగాన్ని కోసి హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో (Maharashtra Shocker) చోటు చేసుకుంది. హత్య చేసిన తర్వాత పోలీసు స్టేషన్ కు వెళ్లి నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. అయితే పోలీసు విచారణలో నిజం ఒప్పుకుంది. దారుణ ఘటన వివరాల్లోకి వెళితే…..మహారాష్ట్ర, కోల్హాపూర్ జిల్లా షాహూవాడీ తాలూగా నందగావ్ ప్రాంతంలోని మంగూల్ వాడికి చెందిన మయాత్ ప్రకాశ్ పాండురంగ కాంబ్లే(52) వందనా ప్రకాశ్ కాంబ్లే(50) భార్యా భర్తలు. వీరిద్దరూ కూలి చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ ఒక ఫాంహౌస్‌లో కూలీలుగా పనిలో చేరారు.
అక్కడ పనిలో చేరినప్పటి నుంచి భర్త పాండురంగకు భార్య వందన ప్రవర్తనపై అనుమానం పెరిగింది. నువ్వు ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని చెప్పి ఆమెను వేధించ సాగాడు. రోజూ తాగొచ్చి భార్యను కొట్ట సాగాడు. సోమవారం రాత్రి మద్యం సేవించి వచ్చి పాండురంగ భార్య వందనను కొట్టసాగాడు. ఈక్రమంలో మద్యం మత్తులో ఉండి తనను కొడుతున్న భర్తను అడ్డుకుని అవతలకు తోసేసింది. ఆ దెబ్బకు పాండురంగ కింద పడ్డాడు. ఇంతలో బయటకు వెళ్లి బండరాయిని తీసుకు వచ్చిన వందన భర్త తలపై బలంగా (Woman kills husband) కొట్టింది. ఆదెబ్బలకు పాండురంగ కింద పడిపోయి అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయాడు. అయినా ఆమె కోపం చల్లారలేదు. ఇంట్లోనే ఉన్న కత్తితీసుకుని అతని మర్మాంగాన్ని (cutting off his genitals) కోసేసింది. దీంతో అతడు మరణించాడు.
అనంతరం ఆమె షాహూవాడీ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన భర్త మద్యం మత్తులో కత్తితో కోసుకుని, తలను రాతి కేసి కొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు పాండురంగ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మల్కాపూర్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో పాండురంగపై హత్యాయత్నం జరిగినట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులు వందనను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. చివరికి వందన తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. వందనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.