Maharashtra Rains: ఉప్పొంగిన గోదావరి, నీట మునిగిన పలు ఆలయాలు, తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం, మహారాష్ట్రలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు
Temples were submerged in Nashik (Photo-ANI Video)

Mumbai, Sep 13: మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పి లేని వ‌ర్షాలు (Maharashtra Rains) కురుస్తున్నాయి. దాంతో గోదావ‌రి న‌ది ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తోంది. న‌దీ తీర ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నాసిక్‌ నగ‌రంలో గోదావ‌రి న‌ది (river Godavari was overflowing) వెంబడి ఉన్న ప‌లు ఆల‌యాలు ( Nashik Temples ) వ‌ర‌ద‌నీటిలో మునిగిపోయాయి.

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింద‌ని, ఈ ఉద‌యం ఆ వాయుగుండం ఒడిశా తీరాన్ని తాకింద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఆ వాయుగుండం ప్ర‌భావంతో దేశంలోని ప‌శ్చిమ, మ‌ధ్య భార‌త రాష్ట్రాల్లో ఇవాళ‌, రేపు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు కూడా ఆ వాయుగుండ‌మే కార‌ణమ‌ని వాతావ‌ర‌ణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

ముంబైలో ఆగని అత్యాచారాలు, సుత్తితో కొట్టి యువతిని దారుణంగా రేప్ చేసిన కామాంధుడు, నిందితుడిని అరెస్ట్ చేసిన థానే పోలీసులు, మరో ఘటనలో మూత్ర విసర్జనకు వెళ్లిన చిన్నారిపై అత్యాచారం

మహారాష్ట్రలోని ముంబై సబర్బన్ జిల్లాల్లో రాగల రెండు రోజుల్లో భారీవర్షాలు కురుస్తాయని ముంబై వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముంబై, రాయగడ్, రత్నగిరి, సింధూర్గ్, నాసిక్, పూణే, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో వచ్చే రెండు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.సోమవారం ముంబై సబర్బన్ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. దక్షిణ ముంబైలో గత 24 గంటల్లో 20 నుంచి 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు.

Here's ANI Video

థానే, నవీ ముంబై ప్రాంతాల్లో 40 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.రాగల 48 గంటల్లో ముంబై సబర్బన్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావం వల్ల ముంబైలో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. భారీవర్షాల వల్ల ముంబై సబర్బన్ ప్రాంతాల్లో వరదలు వెల్లువెత్తే అవకాశాలున్నాయి.