Anand Mahindra: హోటళ్లో అంట్లు తోముతున్న మిలీయనీర్ కొడుకు, బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్
Mahindra Group Chairman Anand Mahindra offers internship to a millionaire’s son (Photo-Twitter)

Mumbai, Novemebr 14: సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా (Mahindra Group Chairman Anand Mahindra) ఎవరికీ ఏ సమస్య వచ్చినా వెంటనే ట్విట్టర్లో స్పందిస్తూ ఉంటారు. ట్విట్టర్లో ఎప్పుడూ సామాజిక అంశాల మీద ఆయన పోస్టులు ఉంటాయి. అలాగే కొన్ని సరదా పోస్టులు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ మధ్య ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ పోస్టు వైరల్ అయింది.

మిలీనియర్ కొడుకు హోటళ్లో కప్పులు కడుగుతూ రోడ్డు మీద పడుకుంటున్నాడనే వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ విషయంపై ఆనంద్ మహీంద్రా వెంటనే స్పందించారు.

మిలీనియర్‌ ఆయిల్‌ ట్రెడర్‌ కుమారుడికి తమ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ (internship opportunity)చేసే అవకాశం కల్పిస్తామని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన మిలీనియర్‌ రాకేశ్‌ థక్కర్‌ ( millionaire Rakesh Thakkar) కొడుకే ఈ ద్వార్‌కేశ్‌ థక్కర్‌ (Dwarkesh). ఈ కుర్రాడు ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు.

అయితే చదువు పట్ల ఆసక్తి లేని కారణంగా తన స్వస్థలం పాంద్రా నుంచి సిమ్లాకు వెళ్లిపోయాడు. సొంతంగా ఎదగాలని నిర్ణయించుకొని అక్కడ ఓ హోటళ్లో అంట్లు శుభ్రం చేసే పనిలో చేరాడు. ప్రతి రోజు అంట్లను శుభ్రం చేసి వారు పెట్టింది తింటూ అక్కడే రోడ్లపైనే నిద్రపోయేవాడు.

ఇంటర్న్ షిప్ చేసే అవకాశం ఇస్తామన్న ఆనంద్ మహీంద్రా 

ఈక్రమంలో సిమ్లా పోలీసులు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా అతను ఓ మిలీనియర్‌ కొడుకు అని తేలింది. ఓ మిలీనియర్‌ కొడుకు అంట్లు తోముతున్న దృశ్యాలు ప్రధాన పత్రికల్లో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మహీంద్రాా ఆనంద్‌.. అతనికి తన కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పించారు. ఈ విషయంపై థక్కర్‌ స్పందిస్తు మహీంద్ర కంపెనీ ఆఫర్‌ను కచ్చితంగా స్వీకరిస్తానని తెలిపాడు. కంపెనీ అధికారులను త్వరలోనే కలుస్తానని ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

మరోవైపు థక్కర్‌ తండ్రి మిలీయనీర్ అయిన రాకేశ్‌ థక్కర్‌ మహీంద్ర ఆఫర్‌ చేసిన ఇంటర్న్‌షిప్‌పై స్పందిస్తూ తన కుమారుడికి జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉందని, కచ్చితంగా ఏదో ఒక రోజు నెరవెరుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తుల్లో గొప్ప పారిశ్రామికవేత్తగా ద్వార్‌కేశ్‌ థక్కర్‌ ఎదుగుతాడని ఆనంద్‌ మహీంద్ర చెప్పడం చెప్పడం ఆసక్తికర అంశంగా చెప్పవచ్చు.