Make in India to rape in India: Adhir Ranjan Chowdhury attacks PM Narendra Modi over crimes against women (Photo-ANI)

New Delhi,December 10: దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) ఫైర్ అయ్యారు. మహిళలపై నేరాల తీరు చూస్తుంటే మనం మేకిన్‌ ఇండియా దిశగా కాకుండా రేపిన్‌ ఇండియా(Make In India To Rape In India) వైపు పయనిస్తున్నామనే సందేహం కలుగుతోందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు.

ప్రతి అంశంపైనా మాట్లాడే ప్రధాని (PM Narendra Modi) మహిళలపై నేరాల గురించి మాత్రం నోరు మెదపకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉత్పత్తి రంగానికి బూస్ట్ ఇచ్చేలా ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా నుంచి భార‌త్‌.. రేప్ ఇన్ ఇండియాగా మారుతోంద‌ని అధిర్ విమ‌ర్శించారు.

దేశం క్రమంగా లైంగిక దాడులకు కేంద్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ హత్యాచార ఘటన, ఉన్నావ్‌ లైంగిక దాడి ఘటనలు దేశంలో కలకలం రేపాయని అన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రజలు వేడుకగా జరుపుకున్నారని గుర్తు చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై విమర్శలు చెలరేగినా పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతించారని, సీనియర్‌ రాజకీయ నేతలు సైతం పోలీసుల చర్యను సమర్ధించారని చెప్పారు.

కాగా అంత‌క‌ముందు క‌శ్మీర్ అంశంపై అధిర్‌, షా మ‌ధ్య వాగ్వాదం జరిగింది. క‌శ్మీర్‌లో సాధార‌ణ ప‌రిస్థితి నెల‌కొన్న‌దా అన్న అంశంపై ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు మాట‌ల తూటాలు సంధించుకున్నారు. క‌శ్మీర్ లోయ సంపూర్ణంగా సాధార‌ణంగా ఉంద‌ని అమిత్ షా తెలిపారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత క‌శ్మీర్‌లో ర‌క్త‌పాతం జ‌రుగుతుంద‌ని కాంగ్రెస్ భావించిందని కానీ అక్క‌డ ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ద‌ని తెలిపారు. ఒక్క బుల్లెట్‌ను కూడా ఫైర్ చేయ‌లేద‌న్నారు.