Amritsar December 18:  పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ మందిరం(Amritsar Golden Temple )లో ఉద్రిక్తత నెలకొంది. మందిరంలోకి ఒక ఆగంతకుడు చొరబడ్డాడు. అందులో ఉన్న సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్‌ సాహిబ్‌(Guru Granth Sahib)ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్వర్ణ మందిరం భద్రతా సిబ్బంది ఆగంతుకుడిని అడ్డుకున్నారు. గురుగ్రంథ్‌ సాహిబ్‌(Guru Granth Sahib)ను అపవిత్రం చేసేందుకు యత్నించడంతో ఆగ్రహించిన భక్తులు అతడిపై దాడి(Man Beaten To Death ) చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న వెంటనే అమృత్‌సర్‌(Amritsar) డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని అమృత్‌సర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం శవపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. మృతిచెందిన వ్యక్తి వయసు 20-25 ఏళ్ల మధ్య ఉంటుందని, అతడు ఎక్కడి నుంచి వచ్చాడో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.

Punjab Congress Poll Panel: పంతం నెగ్గించుకున్న సిద్ధూ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల టీమ్‌ ప్రకటించిన కాంగ్రెస్, సిద్ధూ నేతృత్వంలోనే బరిలోకి దిగుతున్న కాంగ్రెస్, సీఎం చన్నీకి నామమాత్రపు పదవి

గోల్డెన్ టెంపుల్‌ లో జరిగిన ఘటనను సీఎం చరణ్ సింగ్ చన్నీ ఖండించారు. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.