Navjot Singh Sidhu (Photo Credits: IANS/File)

Punjab December 13:  పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల(Punjab Assembly elections) కోసం కాంగ్రెస్(Congress) రెడీ అవుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే సన్నద్దమవుతోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్(Amrinder singh) కాంగ్రెస్ ను వీడటంతో....వీలైనంత డ్యామేజీ కంట్రోల్ కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu)కు కీలక బాధ్యతలు అప్పగించింది.

ఆయన సారథ్యంలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్(Sidhu to Lead elections) నిర్ణయించింది. 2022 అసెంబ్లీ ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఈ క‌మిటీకి సిద్దూయే చైర్మ‌న్‌. కాంగ్రెస్ సంస్థాగ‌త వ్య‌వ‌హార‌ల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్(KC Venugoopal) పేరుతో ఈ లేఖ విడుద‌లైంది. అయితే పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ(Charanjit Singh Channi)కి మాత్రం ఇందులో కేవలం సభ్యుడిగా మాత్రమే ఛాన్స్ ఇచ్చింది. ఇక ప్ర‌చార క‌మిటీకి చైర్మ‌న్‌గా సీనియ‌ర్ నేత సునీల్ జాఖ‌డే(Sunil Jakhar) నియ‌మితుల‌య్యారు. మ‌రో సీనియ‌ర్ నాయ‌కురాలు అంబికా సోనీ(Ambika soni) స‌మ‌న్వ‌య స‌మితికి అధ్య‌క్షురాలిగా, మేనిఫెస్టో క‌మిటీ చైర్మ‌న్‌గా ప్ర‌తాప్ సింగ్ బాజ్వా(Partap Singh Bajwa) ను నియ‌మించింది అధిష్ఠానం. వారితో పాటూ చాలా మంది సీనియ‌ర్ల‌కు అధిష్ఠానం ఈ క‌మిటీలో చోటు క‌ల్పించింది.

Punjab Politics: బలమైన కారణం అదే..72 రోజులకే పీసీసీ చీఫ్‌ పదవికి సిద్ధూ రాజీనామా, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

చాలా రోజుల పాటు పంజాబ్ కాంగ్రెస్ గ్రూపుల త‌గాదాల‌తో స‌త‌మ‌త‌మైంది. మాజీ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌(Amrinder singh), న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu)కు అస్స‌లు ప‌డేదే కాదు. ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేది. చాలా సార్లు అధిష్ఠానం జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. అయిAmbika Soni,నా ఇద్ద‌రూ వెన‌క్కి త‌గ్గలేదు. చివ‌రికి కెప్టెన్ అమరీంద‌ర్ సింగ్ పార్టీని వీడి వెళ్లిపోయారు. ఒకవేళ అమరీందర్ కాంగ్రెస్‌ లో ఉండి ఉంటే....ఇరువురి మధ్య ఆధిపత్యపోరుతో ఈ కమిటీ మరింత ఆల్యమయ్యేది. ఇప్పుడు కేవలం సిద్ధూపై మాత్రమే బారం వేస్తూ కాంగ్రెస్ కమిటీని నియమించింది. అయితే సిద్దూకు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌(Rahul Gandhi), ప్రియాంక(Priyanka Gandhi) ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని ఓపెన్ సీక్రెట్‌. అయితే బాధ్య‌త‌ల విష‌యంలోనే కాస్త అటు ఇటుగా న‌డిచింది వ్య‌వ‌హారం. చివరికి సిద్దూ పంతం నెగ్గించుకున్నాడు.