Arvind Kejriwal Security Breach

New Delhi, OCT 06: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికపైకి చేరుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆప్‌ కార్యకర్తలు, పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆదివారం ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంలో ‘జనతా కీ అదాలత్’ (jan Ki Adaalath) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. కాగా, సభకు హాజరైన వారిలో ఒక వ్యక్తి ఈ సందర్భంగా కలకలం సృష్టించాడు.

Here's the Video

ఉన్నట్టుండి ఆ వేదిక వద్దకు వెళ్లేందుకు (Arvind Kejriwal Security Breach) అతడు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్‌ కార్యకర్తలు అతడ్ని పట్టుకున్నారు. అయితే కేజ్రీవాల్‌కు ఏదో చెప్పేందుకు ఆ వ్యక్తి సైగలు చేశాడు. చివరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బయటకు తరలించారు.

Chennai Air Show Stampede: చెన్నై ఎయిర్ షోలో విషాదం, ల‌క్ష‌లాది మంది త‌ర‌లిరావ‌డంతో తొక్కిస‌లాట‌, వంద‌లాది మందికి అస్వ‌స్థ‌త‌, ముగ్గురు మృతి 

మరోవైపు ఈ సంఘటన జరిగినప్పుడు ఢిల్లీ సీఎం అతిషి, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, గోపాల్ రాయ్ వంటి ఆప్‌ ముఖ్య నేతలు ఆ వేదికపై ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.