WB Shocker: పశ్చిమ బెంగాల్‌లో దారుణం, ప్రియురాలు భర్తను వదిలి రాలేదని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు, తర్వాత జైలుకు వెళతాననే భయంతో రైలు కిందపడి ఆత్మహత్య
Murder (Photo Credits: Pixabay)

Siliguri, Nov 16: ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రేమికురాలిని 35 ముక్కలుగా నరికి చంపిన దారుణమైన హత్య వార్తతో దేశం షాక్‌కు గురైన ఒక రోజు తర్వాత, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఒక వ్యక్తి ప్రియురాలిని కత్తితో దారుణం పొడిచి చంపేశాడు. అనంతరం అతను ఆత్మహత్య (Man dies by suicide) చేసుకున్నాడు. సిలిగురి మెట్రోపాలిటన్ పోలీస్ న్యూ జల్పాయిగురి పోలీస్ స్టేషన్ పరిధిలోని చతుర గచ్ ఖతల్ స్లమ్ ఏరియాలో ఈ ఘటన (killing girlfriend in West Bengal) జరిగింది. సిలిగురి పోలీసులు తన ప్రేమికుడి చేతిలో హత్యకు గురైన రియా బిస్వాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ప్రియురాలిని చంపేసిన కిరణ్ దేబ్‌నాథ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లైవ్ లోనే (Facebook live) రైలు కింద పడి చనిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నదియా జిల్లాకు చెందిన రియా అనే మహిళ తన భర్త రోమియో బిస్వాస్‌తో కలిసి సిలిగురిలో నివసిస్తుంది. వీరికి ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే రెండేళ్లుగా కిరణ్‌ అనే యువకుడితో రియా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. భర్త లేని సమయాల్లో ఇద్దరూ తరుచుగా కలుసుకునేవారు.కాగా గత అక్టోబర్‌ ఇద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోయినట్లు తెలిసింది. అయితే తర్వాత రియా తన భర్త వద్దకు తిరిగి వచ్చింది.

ప్రియురాలిని 35 ముక్కలుగా నరికిన కేసులో షాకింగ్ నిజాలు, ఫ్రిజ్‌లో ప్రియురాలిని శరీర భాగాలను పెట్టి మరొకరితో రాసలీలలు నడిపిన ప్రియుడు

అయితే భర్తను వదిలేసి తన దగ్గరకు రావాలని కిరణ్‌ వివాహితపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి రియా అంగీకరించకపోవడంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. పలుమార్లు దాడి చేశాడు. ఈ క్రమంలో భర్త ఇంట్లో లేని సమయంలో ఆదివారం రాత్రి కిరణ్‌ రియా ఇంటికి వెళ్లాడు. వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో కోపంతో కిరణ్‌ అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కొసి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం పిల్లవాడు ఏడుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చి చూడగా రియా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివాహిత మృతదేహాన్ని బాత్రూమ్‌లో స్వాధీనం చేసుకున్నారు. శరీరంపై కొట్టిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ప్రియురాలిని హత్య చేసిన రోజు రాత్రి.. న్యూజల్‌పైగురి రైల్వే స్టేషన్‌కు వెళ్లిన కిరణ్‌.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. చనిపోయే ముందు అతను ఫేస్‌బుక్‌ లైవ్‌ చేశాడు. లైవ్ లో..‘అవును నేను రియాను చంపాను. కానీ ఆమెను చంపకుండా ఉంటే ఇలా ఆత్మహత్య చేసుకునే వాడిని కాదు. కానీ ఆమె నాకు మరో మార్గం లేకుండా చేసింది. నాకు భయంగా ఉంది. జీవించడానికి ఇంకేం లేదు. నేను బతికితే నా జీవితాంతం జైల్లోనే గడపాల్సి వస్తుంది. అందుకే చనిపోతున్నానని వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.