Bhopal, July 25: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను స్నేహితుడు రేప్ చేశాడని ఆ భార్యకు భర్త విడాకులిచ్చాడు. మీ స్నేహితుడు నాపై అత్యాచారం (Husband friend raped her ) చేశాడని.. ఆమె తన భర్తకు చెప్పగా అతడు తన స్నేహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా భార్యకే విడాకులిచ్చి ఇంటి నుంచి తరిమేశాడు. దీంతో బాధితురాలు ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లో ఈ దారుణం జరిగింది. భోపాల్‌కు చెందిన 28 ఏళ్ల హిందూ మహిళకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిగింది. అనంతరం ఆమె ముస్లిం మతంలోకి మారింది.
పెళ్లైన కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త స్నేహితుడు హసీబ్ సిద్ధిఖీ, ఆ దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు చొరవ చూపాడు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 28న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, ఆ మహిళ జరిగిన దారుణాన్ని భర్తకు చెప్పింది. అయితే అతడు తన స్నేహితుడిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. భార్యపై అత్యాచారం చేసిన సిద్ధిఖీపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
పైగా భార్యకు విడాకులు (Man divorces wife) ఇచ్చి ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో బాధితురాలు ఇండోర్‌కు వెళ్లింది. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇండోర్ పోలీసులు ఆ కేసును భోపాల్‌లోని గౌతమ్ నగర్ ప్రాంతం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన సిద్ధిఖీతోపాటు మహిళ భర్తను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
.