 
                                                                 Kolakata, Dec 16: పశ్చిమ బెంగాల్ సిలీగుడిలో (West Bengal's Siliguri )దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.10 కోసం జరిగిన గొడవలో (Man kills friend over Rs 10) స్నేహితుడ్ని ఓ యువకుడు బండరాయితో కొట్టి చంపాడు. వైకంఠపూర్ అడవిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడ్ని రామ్‌ప్రసాద్ సాహాగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
సిలిగురి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌ప్రసాద్(20) మత్తుపదార్థాలకు బానిసయ్యాడు.స్నేహితులతో కలిసి తరచూ అడవికి వెళ్లి గంజాయి కొనుగోలు చేసేవాడు. సోమవారం కూడా సుబ్రతా దాస్(22), అజయ్ రాయ్(24)తో కలిసి వైకుంఠపూర్ ఫారెస్ట్‌కు వెళ్లారు. అక్కడ మత్తుపదార్థాలు కొనుగోలు చేశారు.అయితే తనకు ఇంకా గంజాయి కావాలని, కొనుగోలు చేసేందుకు రూ.10 ఇవ్వాలని రామ్‌ప్రసాద్ సుబ్రతా దాస్‌ను అడిగాడు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రామ్‌ప్రసాద్‌ను సుబ్రతా దాస్ పక్కనే ఉన్న బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి అడవి నుంచి ఇద్దరూ పారిపోయారు. పోలీసులు బుధవారం రాత్రి సుబ్రతా దాస్, అజయ్‌ను అరెస్టు చేశారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
