Haridwar, November 29: ఉత్తరాఖండ్(Uttarakhand)లో పెను ప్రమాదం తప్పింది. ఐడీకార్డు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఏకంగా రైలుకే నిప్పు పెట్టాడు. రిషికేశ్-ఢిల్లీ ప్యాసింజర్ రైలుకు ఈ ఉన్మాది నిప్పు అంటిచినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్(Haridwar) లో రిషికేశ్-ఢిల్లీ ప్యాసింజర్ రైలు(Rishikesh- Delhi Passenger)కు ఓ వ్యక్తి నిప్పంటించాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుంచి పెట్రోలు బాటిల అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో అతను చెప్పిన సమాధానం షాక్ కొట్టేలా ఉంది. నాకు ఐడీ కార్డు (ID card) ఇవ్వలేదు, అందుకే రైలు బోగీకి నిప్పు అంటించాను, సీట్లను చించేశాను అని ఆ నిందితుడు తెలిపాడు. నిందితుడికి ఏదైనా క్రిమినల్ రికార్డు ఉందా లేదా అని ఉత్తరాఖండ్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో రైలు కోచ్ పాక్షికంగా కాలిపోయింది.
ANI Tweet
Haridwar: Police arrested a person who set a coach of Rishikesh- Delhi Passenger train on fire, yesterday. The accused (pic 3) says,"my ID card was not being issued so I set the coach on fire and tore seat covers of the train." #Uttarakhand (28.11) pic.twitter.com/7bGoGMzI3p
— ANI (@ANI) November 29, 2019
అలాగే అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటీ.. నిజంగా మతి స్థిమితం లేదా లేక ఇంకేదైనా కోణంలో జరిగిందా అనే విషయాన్ని(Police is conducting further investigation) పోలీసులు శోధిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.