Bengaluru, Nov 23: మంగళూరు ఆటోరిక్షా పేలుడు కేసును (Mangaluru Autorickshaw Blast Case) త్వరలో అధికారికంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగిస్తామని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ( Karnataka DGP Praveen Sood) బుధవారం ఇక్కడ తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర సూద్ నగర శివార్లలోని పేలుడు ఘటనా స్థలాన్ని, ఆటో డ్రైవర్ పురుషోత్తం పూజారి చికిత్స పొందుతున్న ఆసుపత్రిని కూడా సందర్శించారు.
పేలుడు నిందితుడు మహ్మద్ షరీఖ్ తమిళనాడులోని కోయంబత్తూరు, కన్యాకుమారి వంటి వివిధ ప్రాంతాలకు వెళ్లాడని, దర్యాప్తు కొనసాగుతోందని జ్ఞానేంద్ర విలేకరులతో అన్నారు. విచారణలో భాగంగా వివిధ పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపారు.పేలుడు జరిగిన మొదటి రోజు నుండి ఎన్‌ఐఎ మరియు కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తులో భాగమయ్యాయని, త్వరలోనే కేసును అధికారికంగా ఎన్‌ఐఎకు అప్పగిస్తామని చెప్పారు.
చైనాలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో సజీవ దహనమైన 38 మంది శ్రామికులు, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు
కర్ణాటకలో మంగళూరులో కుక్కర్‌బాంబు పేలుడు సంచలనం రేకెత్తించింది. శనివారం సాయంత్రం కంకనాడి పోలీసుస్టేషన్ పరిధిలో గరోడి వద్ద ఆటోలో కుక్కర్ బాంబు పేలింది. తొలుత ప్రమాదమని భావించినా, దర్యాప్తులో ఉగ్రవాద కుట్రగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శివమొగ్గ పోలీసులు గాలిస్తున్న షారిక్ (23) అనే వ్యక్తి ఈ పేలుడు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు.
మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళూరులో పర్యటించారు. ఆయన వెనుదిరిగాక సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. కొంతకాలంగా మైసూరులో తలదాచుకున్న షారిక్ అక్కడే బాంబును తయారు చేసి ఉంటాడని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అక్కడి నుంచి సుళ్య మీదుగా మంగళూరుకు బస్సులో వెళ్లిన షారిక్ తర్వాత ఆటోలో ప్రయాణిస్తుండగా, కుక్కర్ బాంబు పేలింది.
ఈ ఘటనలో ఆటోడ్రైవర్ పురుషోత్తం తీవ్రంగా గాయపడ్డాడు. మంగళూరు, కోయంబత్తూరు మధ్య పేలుడుకు పాల్పడిన వ్యక్తి సంచరించినట్టు అనుమానాలు ఉన్నాయి. మైసూరులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తప్పుడు చిరునామాతో అనుమానితుడికి పది ఫోన్లు విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాంబుపేలుడు ఘటనలో పట్టుబడిన వ్యక్తి అతనేనని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన అనుమానితుడికి మంగళూరులోని ఫాదర్ ముల్లర్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతను మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో విచారణ సాధ్యం కావడం లేదని ఏడీజీపీ అలోక్ కుమార్ ప్రకటించారు. బాంబు పేలుడుతో అప్రమత్తమైన ఐదుగురు ఎన్‌ఐఏ అధికారులు మంగళూరు చేరుకుని, ఆదివారం ఉదయం నుంచి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో కుక్కర్‌తోపాటు బ్యాటరీ, టైమర్‌ను స్వాధీనం చేసుకున్నారు. షారిక్‌తో సంబంధాలున్న అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు గాలిస్తున్నారు.