Mangaluru, August 2: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినిపై అత్యాచారం (Girl sexually assaulted in Surathkal) చేసి, అనంతరం వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న నిందితుడిని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చేపల లారీకి డ్రైవర్‌గా పని చేస్తున్న మునాజ్ అహమ్మద్(30) జులై 27న మంగళూరు ఎన్‌ఐటీకే బీచ్‌కి వెళ్లాడు. అక్కడ ఉన్న విద్యార్థినులను బెదిరించాడు. నగరంలోని ఓ కాలేజీలో చదువుతున్న అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ జూలై 27 మధ్యాహ్నం బీచ్‌లో ఉండగా నిందితుడు మునాజ్ అహ్మద్ (30) వారిని ఇబ్బంది పెట్టాడు.
బీచ్‌లో అమ్మాయి, అబ్బాయి కలిసి ఉన్న వీడియో తన వద్ద ఉందని మునాజ్ బ్లాక్ మెయిల్ చేశాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని బాలుడిని బెదిరించి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సూరత్‌కల్ బీచ్‌లో అమ్మాయిపై అత్యాచారానికి (Sexually Assaulting Student) పాల్పడి వీడియో తీశాడు.అనంతరం ఆ వీడియోను ఆమెకు పదేపదే చూపించి వేధించటం ప్రారంభించాడు. బాధితురాలు మంగళూరు పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయటంతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.