File image of PM Narendra Modi (Photo Credits: PTI)

New Delhi, January 31: ఈ ఏడాదిలో తొలిసారిగా ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆదివారం (Mann Ki Baat Highlights) ప్రసంగించారు. కరోనా వ్యాక్సిన్‌తో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని.. భారత్‌ను చాలా దేశాలు ప్రశంసిస్తున్నాయని పేర్కొన్నారు. బ్రెజిల్ రాష్ట్రపతి కూడా భారత్‌ వ్యాక్సిన్‌ను ప్రశంసించారని, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ భారత్‌లో జరుగుతోందని ప్రధాని తెలిపారు. 15 రోజుల్లోనే 30లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేశామని పేర్కొన్నారు.

కాగా గణతంత్ర దినోతవ్సం రోజున ఎర్రకోటలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. జనవరి 26న రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో కొంత మంది ఎర్రకోటపై ఇతర జెండాలను ఎగురవేసిన ఘటనను ఆయన ప్రస్తావించారు. అమెరికా వంటి అగ్రదేశానికి 18 రోజులు, బ్రిటన్‌కు 36 రోజులు పట్టింది. మేడిన్‌ ఇండియాలో భాగంగా చేపట్టిన వ్యాక్సిన్‌ భారత్‌ ఆత్మ నిర్భరతకు ప్రతీక. భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌ దేశ ఆత్మగౌరవానికి ప్రతీక’’ అని (Mann Ki Baat Key Take Aways) పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో భారత్ విజయం స్ఫూర్తిదాయకమని.. భారత క్రికెట్‌ జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కుళ్లిపోయిన కూర‌గాయ‌ల నుంచి విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని బోయిన్‌పల్లి మార్కెట్‌లోని కూర‌గాయల వ్యాపారులు నిర్ణ‌యించిన విష‌యాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గుర్తుచేశారు. కూర‌గాయల మార్కెట్‌లలో వివిధ కార‌ణాలవ‌ల్ల రోజూ ట‌న్నుల కొద్ది కూర‌గాయ‌లు కుళ్లిపోతుంటాయని, ఇలా కుళ్లిపోయిన కూర‌గాయ‌ల‌ను పార‌బోయ‌కుండా విద్యుత్ ఉత్ప‌త్తికి వినియోగించాల‌ని హైద‌రాబాద్‌లోని బోయిన్‌ప‌ల్లి కూర‌గాయ‌ల మార్కెట్‌లో వ్యాపారులు నిర్ణ‌యించార‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.

కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి, సినిమా హాళ్లు మొత్తం సీట్లతో నడుపుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్స్ ఓపెన్, ముంబైలో లోకల్ రైళ్లు తిరిగి ప్రారంభం

హైదరాబాద్‌ బోయిన్‌పల్లి సబ్జీ మండిలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, వ్యర్థాలు ఇప్పుడు సంపదగా మారుతున్నాయని పేర్కొన్నారు. సబ్జీ మండిలో ప్రతిరోజు 10వేల టన్నుల వ్యర్థాలను సేకరిస్తారని, 30 కేజీల జీవ ఇంధనంతో పాటు 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని ప్రధాని తెలిపారు. బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌ కూర‌గాయ‌ల వ్యాపారుల నిర్ణ‌యం నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ శ‌క్తికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌ధాని కొనియాడారు. వారి నిర్ణ‌యంతో చెత్త కూడా సంప‌ద‌గా మార‌బోతున్న‌ద‌ని ప్ర‌ధాని చెప్పారు.

దీన్ని చెత్తను బంగారంగా మార్చే ప్ర‌క్రియ‌గా చెప్పుకోవ‌చ్చని ఆయ‌న మెచ్చుకున్నారు. అక్క‌డ ప్ర‌తిరోజు దాదాపు 10 ట‌న్నుల వ‌ర‌కు కూర‌గాయ‌ల వ్య‌ర్థాలు పోగ‌వుతాయ‌ని, వాటి నుంచి రోజుకు 30 కిలోల బ‌యో ఇంధ‌నంతోపాటు 500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్ప‌త్తి అవుతుంద‌ని ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు.