Mann Ki Baat: PM Modi thanks people for 'spirit of unity' after Ayodhya verdict (Photo Credits: PTI)

New Delhi, November 24: మన్‌ కీ బాత్‌ ద్వారా ప్రధాని మోడి దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తానని తన బాల్యంలో అనుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అన్నారు. తాను ఆధ్యాత్మిక మార్గంలోనే వెళ్లాలనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని మన్ కీ బాత్(Mann Ki Baat)లో చెప్పారు.

పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు చేటుగా మారిందని ప్రధానమంత్రి మోడీ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా విద్యార్థులు పుస్తకాలు చదవడం మానేసి, గూగుల్లో వెతుకుతున్నారని పేర్కొన్నారు. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పు(Ayodhya verdict) సమయంలో ప్రజలు చూపిన సద్భావన హర్షణీయమని చెప్పారు. శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వమే మన దేశ నినాదమన్నారు.

ఫిట్ ఇండియా ఉద్యమానికి ప్రజలందరూ మద్దతు తెలిపి ఇందులో పాల్గొనాలని ప్రధాని కోరారు. చలి కాలంలో వ్యాయామం చేయడానికి మంచి వాతావరణ ఉంటుందని చెప్పారు. నవంబరు 26కి మరో రెండు రోజులు మాత్రమే ఉందని, ఆ రోజు రాజ్యాంగ నిర్మాణ దినోత్సవమని, భారత రాజ్యాంగ సభలో నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ప్రకృతి బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందన్నారు. అంతరించిపోతున్న మాతృభాష, సంస్కృతిని కాపాడుకోవాలని మోడీ పిలుపు ఇచ్చారు