Odisha Train Tragedy: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు.. మరో 7 రైళ్లు మళ్లింపు
Representational (Credits: Facebook)

Newdelhi, June 3: ఒడిశాలో (Odisha) ఘోర రైలు ప్రమాదం (Train Accident) నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు (Cancel) చేశారు. టాటానగర్‌ స్టేషన్‌ (Tata Nagar Station) మీదుగా మరో ఏడు రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు. రద్దైన రైళ్లలో.. హావ్‌రా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12837), హావ్‌రా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ (12863), హావ్‌రా-చెన్నై మెయిల్‌ (12839), హావ్‌రా-సికింద్రాబాద్‌(12703), హావ్‌రా-హైదరాబాద్‌(18045), హావ్‌రా-తిరుపతి(20889), హావ్‌రా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12895), హావ్‌రా-సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20831), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ (02837) ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Odisha Train Tragedy Update: పట్టాలపై అంతులేని విషాదం.. ఒడిశా రైలు ప్రమాదంలో ఢీకొన్నవి రెండు రైళ్లు కాదు.. మూడు రైళ్లు.. 250కు చేరిన మృతుల సంఖ్య.. మరో 900 మందికి పైగా గాయాలు.. ఇంకా బోగీల్లోనే 600-700 మంది!

రైళ్ల మళ్లింపు ఇలా..

బెంగళూరు-గువాహటి(12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్‌, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌-హావ్‌డా(12840) రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా-షాలిమార్‌(18048), సికింద్రాబాద్‌-షాలిమార్‌(22850) వారాంతపు రైళ్లను కటక్‌, అంగోల్‌ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి.. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు సానుభూతి