Puri Gangrape Case: శంషాబాద్ ఘటన మరవకముందే మరో దారుణం, కామాంధులకు చిక్కిన మైనర్ బాలిక, పూరీలోని పోలీస్ క్వార్టర్స్‌లోనే సామూహిక అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేశామన్న ఒడిశా డీజీపీ ఎస్ మొహంతి
Minar Girl gangraped in Odisha,dismissed constable and 2 people arrested said Odisha DGP S Mohanty (Photo-ANI)

Puri, December 3:హైదరాబాద్ అత్యాచార ఘటన మరువక ముందే ఒడిశాలోని పూరీలో దారుణం జరిగింది. సోమవారం సాయంత్రం ఒడిశా(Odisha)లో మరో అమాయక మైనర్ బాలిక (Minar Girl) కామాంధుల వలలో చిక్కుకుంది. గతంలోనే సస్పెన్షన్‌కి గురైన ఓ పోలీసు కానిస్టేబుల్ (dismissed constable of Puri Police) మరో ఇద్దరు దుర్మార్గులు కలిసి ఓ మైనర్ బాలికకు లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత పూరీలోని పోలీస్ క్వార్టర్స్‌లోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భువనేశ్వర్‌కు సమీపంలోని నిమాపారా వద్ద జరిగింది.

నిమాపారా గ్రామానికి చెందిన బాలిక బస్సులో ఇంటికి వెళ్లే క్రమంలో మార్గం మధ్యలో దిగింది. స్నాక్స్ తీసుకునేలోపు బస్సు వెళ్లిపోవడంతో బిక్కుబిక్కుమంటూ మరో బస్సు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అటుగా కారులో వచ్చిన సస్పెండైన కానిస్టేబుల్ జితేంద్ర సేథీ(constable Jitendra Sethi).. ఆమెకు లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మబలికాడు.

ANI Tweet

ఆ సమయంలో అమ్మాయికి తాను కానిస్టేబుల్‌నంటూ ఐడీ కార్డ్ కూడా చూపించాడు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా కారులో ఉన్నారు. వారి మాయమాటలు నమ్మిన ఆ అమ్మాయి కారు ఎక్కింది. ఆ తర్వాత ఆమె నోరు నొక్కేసి పోలీస్ క్వార్టర్స్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెను ఆ క్వార్టర్‌లోనే ఉంచి తాళం వేసి బయటకు వెళ్లిపోయారు. అయితే, బాధితురాలి అరుపులు విని ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను రక్షించారు.

బాధితురాలిపై కామాంధులు దాడిచేస్తున్నా ఎంతో ధైర్యంతో వారిని సెల్ ఫోన్ కెమెరాలో బంధించింది. ఆ సీసీ ఫుటేజీనే ఇప్పుడు కేసు విచారణలో కీలకంగా మారింది. దీంతో పాటుగా ఐడీ కార్డును కూడా మైనర్ బాలిక గట్టిగా పట్టుకుంది. ఈ కార్డు ఆధారంగా పోలీసులు సదరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

మైనర్ బాలికపై అత్యాచారం చేసి సస్పెండైన కానిస్టేబుల్ జితేంద్ర సేథీది మొదటి నుంచి నేర చరిత్రేనని పూరీ ఎస్పీ సర్తాక్ సారంగి ((Puri SP Sarthak Sarangi))తెలిపారు. గతంలోనూ సొంత అత్తపైనే అత్యాచారానికి పాల్పడి అరెస్టయ్యాడని వివరించారు. అంతేకాకుండా రెండో భార్యను మంటల్లోకి నెట్టేసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు కూడా అతనిపై కేసులు ఉన్నాయన్నారు. క్రిమినల్ మైండ్ ఉన్న కారణంగానే గత కొంత కాలం నుంచి అతన్ని సస్పెన్షన్‌లో ఉంచినట్లు ఎస్పీ సర్తాక్ సారంగి వెల్లడించారు. ఈ కేసులో బాలికక సత్వరమే పూర్తిగా న్యాయం జరిగేలా చూస్తామని ఒడిశా డీజీపీ ఎస్ మొహంతి(Odisha DGP S Mohanty) తెలిపారు.