MLA Honeytrap Case Bengaluru police arrest criminal gang for honey trapping Karnataka politicians (Photo-IANS)

Bengaluru, November 30: ఆ మధ్య బెంగుళూరు(Bengaluru)లో ఎమ్మెల్యేల హానీ ట్రాప్ ( Honeytrap) కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల(Karnataka politicians and businessmen )కు అందమైన అమ్మాయిలను ఎర వేసి వారు అమ్మాయిలతో రాసలీలల్లో మునిగి తేలుతున్నప్పుడు వీడియో(Videos)లు తీసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కేసులో ఎమ్మెల్యేలు టార్గెట్ (Target Mla's) గా హానీ ట్రాప్ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పరప్పణ అగ్రహారకు చెందిన రాఘవేంద్ర ఎలియాస్ రఘు(Raghavendra alias Raghu), మంజునాధ్ లతో పాటు కోరమంగలకు చెందిన పుష్ప, బనశంకరికి చెందిన పుష్పలను మరో నలుగురిని బెంగుళూరు సీసీబీ పోలీసులు(Bengaluru Central Crime Branch) అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, శ్రీమంతుల రాసలీలల వీడియోలు రహస్యంగా చిత్రీకరించిన రాఘవేంద్ర కోట్ల రూపాయలు సంపాధించాడు. ముఖ్యంగా తమ పరువు పోతుందని ఆందోళనతో డబ్బులు ఇవ్వడానికి సిద్దం అయిన రాజకీయ నాయకులు, శ్రీమంతులను రాఘవేంద్ర మరింత ఎక్కువగా బ్లాక్ మెయిల్ చేశాడని సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

హనీట్రాప్ కేసులో అరెస్టు అయిన ఇద్దరు యువతుల్లో ఒకరు సినీ పరిశ్రమలో మేకప్ చేస్తున్నారని, మరో యువతి నటి అని పోలీసులు తెలిపారు. రాఘవేంద్ర ఇంటిలో సోదాలు చేసి పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు, సీక్రెట్ కెమెరాలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు.

ఈ కేసులో నిజాలు దిమ్మతిరిగేలా ఉన్నాయి. అరెస్టైన మహిళలు మొదట ఎమ్మెల్యేల వద్దకు తమ కష్టం చెప్పుకునే వారిలా వెళ్లి వారితో పరిచయం పెంచుకుని హోటల్ రూములకు రప్పించే వారు. అక్కడ వారితో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఈ ముఠా వీడియో తీసేది.

అనంతరం ఆ వీడియోలు చూపించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి, వారి వద్దనుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ ముఠా ఉత్తర కర్ణాటకకు చెందిన ఒక ఎమ్మెల్యే(North Karnataka politician) పై హానీ ట్రాప్ ప్రయోగించి గత ఏడాది కాలంగా కోటి రూపాయలు పైగా డబ్బు వసూలు చేశారు.

ఆయనతో ఈ మహిళలు సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తామని బెదిరించటంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వీరిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితులను మీడియా ముందు చూపించలేమని పోలీసులు తెలిపారు. కాగా వీరి చేతిలో ఎంతమంది మోసపోయారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎమ్మెల్యే కు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో గుర్తించిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ ముఠా ఇద్దరు అందమైన మహిళల ద్వారా రాజకీయ నాయకులను ముగ్గులోకి దించి వారు ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియో తీసి కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆ మధ్య మధ్యప్రదేశ్లో హానీట్రాప్‌ ముఠా ఎంత సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.