New Delhi, FEB 18: ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు చెందిన 123 ఆస్తులను (Waqf properties) స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 8న వక్ఫ్ బోర్డుకు లేఖ రాసింది. ఈ ఆస్తుల పరిధిలో మసీదులు, దర్గాలు, సమాధులు కూడా ఉండటం గమనార్హం. వీటిని 2014 ఎన్నికలకు ముందు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది. వాటన్నింటిని ఇప్పుడు మోదీ నేతృత్వంలోని మోదీ సర్కారు వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. కేంద్ర నిర్ణయంపై బోర్డు చైర్మన్, ఆప్ ఎమ్మెల్యే అమానాతుల్లా ఖాన్ (Amanatullah Khan) తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తుల్ని స్వాధీనపరచడం జరగదని, అడ్డుకుని తీరతామని ఆయన తేల్చిచెప్పారు.
123 Waqf Properties” पर पहले ही अदालत में हमने आवाज़ उठाई है,High Court में हमारी Writ Petition No.1961/2022 पेंडिंग है।
कुछ लोगों द्वारा इसके बारे में झूठ फैलाया जा रहा है, इसका सबूत आप सबके सामने है। हम वक़्फ़ बोर्ड की Properties पर किसी भी तरह का क़ब्ज़ा नहीं होने देंगे। pic.twitter.com/UcW3rc0xJl
— Amanatullah Khan AAP (@KhanAmanatullah) February 17, 2023
కేంద్రం నిర్ణయానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదని ట్వీట్ చేశారు. అయితే డిప్యూటీ ల్యాండ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఫిబ్రవరి 8న ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు లేఖ రాశారు. ఇందులో 122 ఆస్తులకు సంబంధించిన అన్ని విషయాలను విముక్తి చేయాలని స్పష్టం చేవారు.