Mother and children saved from cesarean delivery of cockroaches VIDEO (photo-Twitter)

Siberia, December 31: మనుషులకే కాదు, జంతువులు, పక్షులు, కీటకాలకు కూడా ప్రాణం ఉంటుంది. అవి బాధతో విలవిలలాడుతుంటే అయ్యో అని చూస్తూ ఊరుకోకుండా దానికి చికిత్స చేసి కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్లు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. కొన్నిసందర్భాల్లో అయితే వాటి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిస్తే డాక్టర్లు సైతం వాటిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే ఓ బొద్దింకకు(cockroach) ప్రసవం కష్టమైతే డాక్టర్లు సిజేరియన్ (cesarean delivery)ద్వారా దానికి డెలివరీ చేసి తల్లీ బిడ్డను కాపాడారు. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.. అందరూ నమ్మి తీరాల్సిందే..

సాధారణంగా మహిళలకు కాన్పు కష్టమైతే డాక్టర్లు సిజేరియన్(cesarean) ఆపరేషన్ ద్వారా తల్లీ బిడ్డను కాపాడుతారు. మరి ఇక్కడ కూడా బొద్దింకకు అలాంటి పరిస్థితే ఎదురయింది. పాపం కాన్పు కష్టమైపోయింది. దీంతో దాని యజమాని దాని బాధకు చలించిపోయి వెంటనే ఆ బొద్దింకను జంతువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు.. డాక్లర్లు (Russian vets)బొద్దింక అవస్థను చూసిన వెంటనే దానికి సిజేరియన్ డెలివరీ చేశారు...!! ఇప్పుడు తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు...!!!.

Here's Video

 

ఈ వింత ఘటన రష్యాలోని(Russia) సైబేరియా ( Siberia)పరిధిలో గల క్రాస్నోయార్క్స్‌లో(Krasnoyarsk) డిసెంబర్ 21,2019న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన లింపోప్‌ అనే వ్యక్తి బొద్దింకను పెంచుకుంటున్నాడు. ఆర్కిమండ్రిటా జాతికి చెందినది. గర్భంతో ఉన్నఅది పిల్లను కనే సమయంలో ఇబ్బంది పడుతోంది. దీనిని గమనించిన ఆ వ్యక్తి వెంటనే దానిని జీవజంతు వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లాడు.

అక్కడి వైద్యుడు దాని పరిస్థితి గమనించి, వెంటనే దానికి సిజేరియన్ డెలివరీ చేసి, ఆ రెండు ప్రాణులను కాపాడారు. దీంతో లింపోప్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. తరువాత డాక్టర్లు బొద్దింకను జాగ్రత్తగా చూసుకోవటానికి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. తరువాత తన పెంపుడు బొద్దింకను..దాని పిల్లలు లింపోప్ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాడు.ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.