ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రం సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో అన్ని వ్యవస్థలు స్తంభించాయి. చెక్ ఇన్, లగేజ్ కోసం ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సర్వర్ల క్రాష్ వల్ల కంప్యూటర్లు పని చేయకపోవడంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మ్యానువల్ పద్ధతిని పాటిస్తున్నారు. దీంతో ప్రయాణికులు పలు గంటలపాటు క్యూలో వేచి ఉన్నారు. దీని వల్ల విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి.
ప్రయాణికుల ఇబ్బందిపై ఎయిర్ ఇండియా స్పందించింది. వారికి ఎదురైన అసౌకర్యాన్ని నివారించేందుకు తమ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేసింది. అయితే ఎయిర్‌పోర్ట్‌టెర్మినల్ 2లో రెండు గంటల తర్వాత సాధారణ పరిస్థితి నెలకొన్నది.
Here's Video
Manual check-in is going on at #MumbaiAirpot due to a system failure. Long queues of passengers can been seen. @CSMIA_Official pic.twitter.com/SKX9EKjGwI
— LMS ✏️ (@Lalmohmmad) December 1, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)