(Image Credit : Twitter)

Mumbai, October 30: క్రూయిజ్‌ షిప్ డ్రగ్స్ కేసులో(Drugs Case) బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్(Sharukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan) బెయిల్‌పై శనివారం విడుదల అయ్యారు. ఆర్యన్‌కు గురువారమే బెయిల్ మంజూరైంది. కానీ అధికారిక కార్యక్రమాల్లో జాప్యం వల్ల శుక్రవారం కూడా ఆర్యన్ ఖాన్‌ జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

ఆర్యన్‌ ఖాన్ బెయిల్ విష‌యంలో జూహీ చావ్లా(Juhi Chawla) కీలక పాత్ర పోషించారు. ఆర్యన్‌కు బెయిల్‌ రావడానికి ఆమె పూచీకత్తు ఇచ్చారు. ఇందుకోసం జూహీ చావ్లా ముంబై సెషన్‌ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆర్యన్‌ బెయిల్‌కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్‌ పేపర్లపై సంతకం చేశారు.

షారూఖ్‌- జూహీ చావ్లా ఎన్నోసినిమాల‌లో న‌టించ‌డంతో పాటు ప్రస్తుతం ఐపీఎల్‌ టీం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ టీం ఫ్రాంఛైజీ పార్ట్‌నర్స్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె షారూఖ్ ఖాన్‌కి అండ‌గా నిలిచారు. ఆర్యన్‌ విడుదల అవ్వడం కోసం జూహీ చావ్లా నిజంగా పెద్ద ధైర్యం చేశారని చెప్పాలి. తమ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ జైలు నుంచి విడుదల చేయనున్న సందర్భంగా షారుఖ్, గౌరీ ఖాన్‌ల ముంబయిలోని ‘మన్నత్’ను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ముంబై డ్రగ్స్ కేసు, 3వ సారి ఆర్యన్‌ ఖాన్‌కు కోర్టులో చుక్కెదురు, బెయిల్‌ నిరాకరించిన ముంబై స్పెషల్ కోర్టు, హైకోర్టును ఆశ్రయించిన షారుక్ ఖాన్‌ తనయుడు

ఆర్యన్‌ ఖాన్‌కు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు. అతని పాస్‌పోర్టును అప్పగించాలని, తోటి నిందితులతో మాట్లాడకూడదని కండీషన్స్ పెట్టింది కోర్టు.